ప్రేయసి గురించి తొలిసారి స్పందించిన అనంత్‌ అంబానీ

Anant Ambani Reveals First time about Radhika Merchant and His Devotion To Work - Sakshi

రిలయన్స్‌ అధినేత   ముఖేష్ అంబానీ , నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్‌తో  ఏడడుగులు వేసేందుకు సిద్దమవుతున్నాడు. ఈ లవ్‌బర్డ్స్‌ జూలై 12, 2024న పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ప్రీ-వెడ్డింగ్‌ వేడుకల సందడి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1, 2024  షురూ కానున్నాయి.  ఈ క్రమంలో అనంత్‌ తొలిసారి తన కాబోయే భార్య రాధిక గురించి స్పందించారు.  అనంత్‌ కామెంట్స్‌ ఇపుడు వైరల్‌గా మారాయి. 

అనంత్‌ అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గుజరాత్‌, జామ్‌నగరలో ఉన్న  ప్రపంచంలోనే అతిపెద్ద జూ , జంతువుల రక్షణ, పునరావాస కేంద్రాన్ని కేంద్రం. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతోసుమారు 3 వేల ఎకరాల విస్తీర్ణంలో  ‘వంతారా’ ను  ప్రారంభించినట్లు ప్రకటించింది.  ఇందులో భాగంగా విదేశాలలో గాయపడిన   జంతువులను రక్షించడం, చికిత్స చేయడం  పునరావాసం కల్పించడం  దీని లక్ష్యం. చిన్నప్పటి నుంచీ తనకు జంతువుల్ని కాపాడటం అంటే చాలా ఇష్టమని, ఆ ఇష్టంతోనే ‘వంతారా’ కు నాంది పలికిందని  అనంత్‌ తెలిపాడు.. 

నా పని ఇంకా ఈజీ
జంతువులతో ఎక్కువ సమయం గడిపితే పెళ్లి తరువాత మీకేమీ ఇబ్బంది కాదా అని ప్రశ్నించినపుడు అనంత్‌, రాధిక తనలాగే జంతు ప్రేమికురాలని చెప్పాడు.  తాను ఇప్పటికే ప్రతిరోజూ 8-12 గంటలు తన పనికి  వాటి కోసం కేటాయిస్తున్నానని చెప్పాడు.

అంతేకాదు పెళ్లి తరువాత తన పని మరింత సులువు అవుతుందని ఎందుకంటే రాధిక  కూడా తనతో పాటు జంతు రక్షణలో  మరింత భాగం పంచుకుటుందని, తనకు సాయంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు సంతోషంగా. తెల్లవారుజామున 4 గంటలకు  జంతువులకు ఏదైనా అత్యవసర శస్త్రచికిత్సల కోసం కాల్‌లు వచ్చినప్పుడు  ఇద్దరమూ సంఘటనా స్థలానికి పరిగెత్తుకు వెళతామని వెల్లడించాడు. ఇలా జంతువులకు సేవ  చేసే భాగ్యం కల్పించాలని మాత్రమే ఆ దేవుడిని వేడుకుంటానని తెలిపాడు. 

కరీనా ప్రశంసలు

బాలీవుడ్ నటి కరీనా కపూర్  వంతారా గురించి   అనంత్ అంబానీపై ప్రశంసలు కురిపించింది.  జంతు సంరక్షణకు కట్టుబడి 200 ఏనుగులు , వేలాది ఇతర జంతువులు, సరీసృపాలు , పక్షులను వంతారా  రక్షించింది. బ్రేవో, అనంత్ , టీమ్ అంటూ కరీనా ఇన్‌స్టా పోస్ట్‌ పెట్టింది. ఈ సందర్భంగా  టార్జా అనే ఏనుగు స్టోరీని కూడా షేర్‌  చేసింది.

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top