18 ఏళ్లుగా తలలో బుల్లెట్‌తో జీవిస్తున్న వ్యక్తి..చివరికి..

After 18 Years Bengaluru Doctors Remove Bullet Stuck In Mans Head - Sakshi

ఓ వ్యక్తికి తన ప్రమేయం లేకుండానే పదేళ్ల వయసులో తలలోకి బుల్లెట్‌ దిగింది. ఆ తర్వాత నుంచి ఆ బాలుడి దుస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోయింది. అలా దాదాపు 18 ఏళ్లు గడిపాడు. సంప్రదించని ఆస్పత్రిలేదు. ప్రతి ఒక్కరు బుల్లెట్‌ తీయడం కష్టమనే చెప్పారు. ఆ బుల్లెట్‌ కారణంగా విపరీతమైన తలనొప్పి, చెవి ఇన్ఫెక్షన్‌లతో దుర్భర జీవితాన్ని గడిపాడు. చివరికి బెంగళురు ఆస్పత్రి వైద్యులు అతడు ఎదుర్కొన్న నరకం నుంచి విముక్తి కలిగించారు. ఇంతకీ అతడికి తలలో ఎలా బుల్లెట​ దిగింది? ఎవరా వ్యక్తి అంటే..!

యోమెన్‌కి చెందిన సలేహ్‌ అనే 29 ఏళ్ల వ్యక్తి తలలో సమారు 3 సెంటీమీటర్ల బుల్లెట్‌ ఉంది. అతనికి పదేళ్ల ప్రాయంలో ఉండగా.. రెండు ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో ఓ బుల్లెట్‌ అతడి చెవిలోకి దూసుకుని తలలోని ఎడమవైపు ఎముకలోకి దిగిపోయింది. దీంతో అతనికి విపరీతమైన రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు గానీ ఆ బుల్లెట్‌ని మాత్రం తీయలేకపోయారు వైద్యులు. ఎందుకంటే? అది చెవిలోపలకి వెళ్లడం, పైగా దాని ముందర భాగం తలలోపలకి ఉండటం కారణంగా తీయడం వైద్యులకు కష్టంగా మారింది. దీంతో గాయం తగ్గేందుకు మాత్రమే మందులు ఇచ్చి పంపించేశారు సలేహ్‌ని. అప్పటి నుంచి సుమారు 18 ఏళ్లుదాక ఆ బుల్లెట్‌తోనే జీవించాడు. 

ఆ తర్వాత అతడు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ బుల్లెట్‌ కారణంగా  చెవి వినికిడిని కోల్పోయాడు. పైగా చెవి ఇన్ఫెక్షన్‌లు, తలనొప్పితో నరకయాతన అనుభవించాడు. అతడికి ఇద్దరు సోదరులు, చెల్లెళ్లు ఉన్నారు. ప్రస్తుతం సలేహ్‌కి 29 ఏళ్లు. అతడకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ బుల్లెట్‌ అతడి తల నుంచి ఎప్పుడు పోతుందా అనుకునేవాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయిన సలేహ్‌ స్నేహితుల ద్వారా బెంగళూరులోని ఆస్టర్‌ ఆస్పత్రి గురించి తెలుసుకుని మరీ ఎంతో ఆశతో వెళ్లాడు. అయితే వైద్యుల పలు టెస్ట్‌లు చేసి అసాధ్యం అని తేల్చేశారు. ఎందుకంటే? బుల్లెట్‌ సరిగ్గా చెవి లోపల ఎడమవైపు ముఖ్యమైన టెంపోరల్ ఎముక లోపల వాస్కులర్ నిర్మాణాలకు దగ్గరగా ఉంది.

ఇది శస్ర చికిత్సకు అది పెద్ద సవాలు. అందువల్లే వైద్యులు రిస్క్‌ చేసే సాహసం చేయలేకపోయారు. అయితే వైద్యులు ఆ బుల్లెట్‌ కరెక్ట్‌గా ఏ ప్రదేశంలో ఉందో తెలిస్తే తీయడం ఈజీ అని గుర్తించారు. అందుకోసం కాంట్రాస్ట్‌ సీటీ యాంజియోగ్రఫీని ఎంచుకుంది. టూ డైమెన్షియల్‌ ఎక్స్‌రే సాయంతో బుల్లెట్‌ స్థానాన్నిగుర్తించి విపరీతమైన రక్తస్రావం కాకుండా సులభంగా తొలగించారు వైద్యులు. సర్జరీ చేస్తున్నంత సేపు అనుమానంగానే ఉందని అన్నారు వైద్యులు. ఎట్టకేలకు ఈ శస్త్రచికిత్సతో  అతడికి తలనొప్పి తగ్గింది. అలాగే స్పష్టంగా వినిపిస్తోంది కూడా. అంతేగాదు పూర్తి స్థాయిలో కోలుకున్న వెంటనే సలేహ్‌ యెమెన్‌కి తిరిగి వెళ్లిపోయాడు కూడా. 

(చదవండి: ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడల్లా అలా అవుతుంటే అలర్జీ అనుకుంది! కానీ చివరికి..)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top