ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడల్లా అలా అవుతుంటే అలర్జీ అనుకుంది! కానీ చివరికి..

New Zealand Teen Initially Believed Alcohol Allergy But It Is Blood Cancer - Sakshi

పట్టుమని 20 ఏళ్లు నిండలేదు. ఆ చెడు అలవాటు సరదా అనుకుంది. ప్రెజెంట్‌ ట్రెండ్‌ అని స్నేహితులతో తరచుగా బయట పార్టీలు చేసుకుంది. శరీరంపై దద్దర్లు, వాంతులు అవుతున్నా.. జస్ట్‌ ఎలర్జీయే కదా!.. అని లైట్‌ తీసుకుంది. చివరికి అదేంటో తెలిసి ఆమె గుండె ఆగినంత పని అయ్యింది. తనలా మరెవ్వరూ చేయకూడదని ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని అందుకు తన ఉదంతమే నిదర్శనం అంటూ ఆమె గాథని వివరిస్తోంది ఆ మహిళ.

అసలేం జరిగిందంటే..న్యూజిలాండ్‌కి చెందిని పాపీ బెగ్లీకి స్నేహితులతో పార్టీలు చేసుకోవడం అంటే ఇష్టం. ఇలా స్నేహితులతో బయటకి వెళ్లినప్పుడల్లా పార్టీలు చేసుకోవడం అలవాటు. ఆ టైంలో ఆమె వారితో కలిసి ఆల్కహాల్‌ సేవిస్తుంది. ఏమైందో ఏమో గత కొంతకాలంగా ఇలా తాగి ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచే శరరం అంతా దద్దర్లు, వాంతులు అవ్వడం మొదలవుతోంది. ఆమె అది ఆల్కహాలిక్‌ ఎలర్జీ అనుకుంటా అని లైట్‌ తీసుకుంది. అంతగా పట్టించుకోలేదు. పార్టీలు చేసుకున్న ప్రతీసారి ఆమె పరిస్థితి ఇలానే ఉంది. ఉన్నటుండి ఓ రోజు మరింత బలహీనంగా మారి సీరియస్‌ అయ్యింది.

అప్పుడు డాక్టర్‌ ఆమె ఫేస్‌ చేస్తున్న సమస్య ప్రతిదీ నోట్‌ చేసుకుని స్టడీ చేయడం మొదలు పెట్టాడు. తదుపరి ఆల్ట్రాస్కానింగ్‌ వంటి వైద్య పరీక్షలు చేసి హాడ్కిన్స్‌ లింఫోమా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు వైద్యులు. ఈ వ్యాధి ఉన్న వాళ్లకి ఎగ్జిమా, డెర్మటైటిస్‌ వంటి చర్మ వ్యాధులు విపరీతంగా వస్తాయని చెబతున్నారు. కానీ బెగ్లీ అలర్జీ అనే అనుకుంది. వైద్యుల కూడా చర్మవ్యాధిగానే భావించి మందులు ఇచ్చేవారేగానీ సరియైన పద్ధతిలో నిర్ధారణ చేయలేదు. దీనికి తోడు ఆమె కూడా తన శరీరంలోని లక్షణాలను క్లియర్‌గా వివరించలేదు.

అయితే ఆమె వైద్య పరీక్షల్లో తన మెడ కింద కూడా నొప్పిగా ఉందని చెప్పడంతో వారు మరింతగా క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేశారు. అప్పుడే వారు గడ్డ ఉన్నట్లు గుర్తించి క్యాన్సర్‌గా నిర్థారించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె టీనేజర్. కనీసం 20 ఏళ్లు కూడా నిండలేదు. కానీ అప్పుడే నాలుగు శస్త్ర చికిత్సలు, కీమోథెరఫీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరికి ఆమెకు 20 ఏళ్ల వచ్చాయి. అయితే తనలా ఎవ్వరూ చాలా చిన్న ఏజ్‌లోనే ఆల్కహాల్‌ వంటి చెడు అలవాట్ల జోలికి వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెబుతోంది.

అంతేగాదు తనకొచ్చిన హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్‌ బ్లడ్‌ క్యాన్సర్‌కి సంబంధించినదని, దీన్ని చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉంటేనే వైద్యులు క్యూర్‌ చేయగలరంటూ ప్రజలకు అవగాహన కల్సిస్తోంది. ఏదైనా అనుభవిస్తేగానీ తెలిసిరాదంటారు. బహుశా ఇదే కాబోలు.ఎప్పుడోకప్పుడో అందరం పోయే వాళ్లమే. అలాంటప్పుడూ ఈ జీవితాన్ని ఇలా చెడుఅలవాట్లతో పాడుచేసుకోకుండా మంచి ఆహ్లాదకరంగా జీవించడానికి ఉపయోగిస్తే తనకి, సమాజానికి ఉపయుక్తంగా ఉంటుంది. 

(చదవండి: యూకేలో కలవరపెడుతున్న 'వందరోజుల దగ్గు'! అధికారులు వార్నింగ్‌)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top