Nora Fatehi మొదట్లో మొఖం మీదే నవ్వారు, కట్‌ చేస్తే ..నోట్ల వర్షం! | Sakshi
Sakshi News home page

మొదట్లో మొఖం మీదే నవ్వారు, కట్‌ చేస్తే...నోట్ల వర్షం!

Published Tue, Feb 6 2024 5:05 PM

Actress Nora Fatehi worked at hookah bar check her success story - Sakshi

అధునిక డ్యాన్స్‌లకు పర్యాయపదం ఆమె. ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ అయినా తన స్టైల్లో ఇరగదీసి కుర్రకారు మతులను కొల్లగొడుతుంది.  ఐటెం  సాంగ్స్‌తో ఐటెం గర్ల్‌గా, స్టార్‌గా పాపులారీటీ సంపాదించుకుంది. అయితే  ఈ జర్నీ  నల్లేరు మీద నడకలా సాగిందనుకుంటే మాత్రం పొరపాటే. ఆరంభంలో ఈ స్టార్‌కి కూడా వేధింపులు తప్పలేదు. హిందీ భాష తెలియక అవమానాల పాలైంది. దర్శకులతోపాటు సెట్‌లో అందరూ ఆమెను చూసి నవ్వేవారట. కట్‌ చేస్తే..కేవలం ఒక సాంగ్‌కు దాదాపు రూ. 2 కోట్లకు పైగానే  వసూలు చేస్తోంది. బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటతో  దుమ్మురేపిన నోరా ఫతేహి పుట్టిన రోజు సందర్భంగా ఆమె జర్నీ గురించి మరికొన్ని విశేషాలు..

మొరాకో సంతతికి చెందిన నోరా ఫతేహి కెనడాలో పుట్టి పెరిగింది. టొరంటోలోని వెస్ట్‌వ్యూ సెంటెనియల్ సెకండరీ స్కూల్, ఆతరువాత యార్క్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం  అంతర్జాతీయ సంబంధాలను అభ్యసించింది. 2014లో రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన నోరా అతి స్వల్ప కాలంలోనే  ఇండస్ట్రీలో టాప్‌  పొజిషన్‌కు చేరింది.   డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​ కూడా తన సత్తా చాటుకుంది. కానీ ఆరంభ రోజుల్లో  చాలా ఉద్యోగాలు చేసింది. చివరికి హుక్కా బార్‌లో కూడా పనిచేసింది. అక్కడే  డ్యాన్స్‌  బాగా  నేర్చుకుంది.  అలాగే ఎలాగైనా  సినిమాల్లోకి వెళ్లాలన్న కోరికతో ఆడిషన్‌కి వెళ్లినపుడు కాస్టింగ్ డైరెక్టర్లు అవహేళన చేసేవారని గతంలో ఒక సందర్బంలో గుర్తు చేసుకుంది నోరా. ‘‘నీలాంటోళ్లు  ఇక్కడ చాలామంది ఉన్నారు..మీ దేశానికి తిరిగి వెళ్లిపో.. కత్రినా కైఫ్ లాగా మారి పోదామనుకుంటున్నావా’’ అని కూడా హేళన చేశారనీ, అయినా  కష్టపడి భాష నేర్చుకుని, చివరికి  సోదరుడి, పుట్టినరోజు, పెళ్లి అన్నీ పక్కన బెట్టేసి రూంలోనే ప్రాక్టీస్‌ చేస్తూ ఈ రోజు ఈ స్థాయికి చేరినట్టు ఫతేహి చెప్పుకొచ్చింది. డ్యాన్సర్‌ కావాలనేది, అందర్నీ ఎంటర్‌టైన్‌ చేయాలనేదే తన కల అని తెలిపిందామె. 

బాలీవుడ్ సినిమాలతో తెరంగేట్రం చేసిన ఈ భామ. ‘‘దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్‌లో అలజడి రేపింది. ఇక టాలీవుడ్‌లో స్పెషల్‌ సాంగ్స్‌తో అదరగొట్టేసింది. టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి లాంటి  మూవీలతో ఈ బ్యూటీ  టాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను కూడా దోచుకుంది.

ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ సాంగ్‌తో  మంచి క్రేజ్ సంపాదించింది. బాలీవుడ్‌ మూవీస్‌లో యాక్టింగ్‌ ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. అన్నట్టు సోషల్‌ మీడియాలోయాక్టివ్‌గా ఉంటే నోరాకు ఇన్‌స్టాలో 46.2 మిలియన్ల ఫాలోవర్లను సంపాందించు కోవడం  విశేషమే మరి.  అంతేనా టీవీ రియాల్టీ డాన్స్  షోలు, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది.

Advertisement
 
Advertisement