74th Republic Day: పరేడ్‌లో మహిళా శక్తి

74th Republic Day: Women power in Republic Day parade - Sakshi

74వ  గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే రిపబ్లిక్‌ పరేడ్‌లో ఈసారి మహిళా శక్తికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆర్మి, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనికవాతు బృందాలకు మహిళా ఆఫీసర్లు నాయకత్వం వహించనున్నారు. మొదటిసారి మహిళా ఒంటె దళం కవాతు చేయనుంది. డేర్‌ డెవిల్స్‌గా స్త్రీల బృందం మోటర్‌ సైకిల్‌ విన్యాసాలుచేయనుంది. అనేక శకటాలు మహిళా శక్తిని చాటనున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్త్రీ ప్రభావ శక్తికి ఈ పరేడ్‌ వేదిక కానుంది.

గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని  చాటుకుంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్‌ డే పరేడ్‌లో రాష్ట్రపతి భవన్‌ నుంచి ఎర్రకోట వరకు జరిగే సైనిక కవాతు, రాష్ట్ర ప్రభుత్వాల శకటాల విన్యాసం, కళా బృందాల ఆట΄ాటలు. చూడటానికి కళ్లు చాలవు. ఇదంతా కలిసి మన దేశం... మనమంతా కలిసి మన శక్తి అనే భావన ఈ సందర్భంలో కలుగుతుంది. అయితే ఈసారి ఈ ‘మన శక్తి’లో స్త్రీ శక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలుప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్ల ఈ పరేడ్‌ స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలువనుంది.

ముగ్గురు మహిళా సైనికాధికారులు
పరేడ్‌లోపాల్గొనే త్రివిధ దళాల  కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వ స్థానం దొరికింది. నావికా దళంలో నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న లెఫ్టినెంట్‌ కమాండర్‌ దిశా అమృత్‌ (29) 144 మంది నావికులతో కూడిన కవాతు బృందాలకు నాయకత్వం వహించనుంది. బెంగళూరుకు చెందిన దిశ అమృత్‌ 2016లో నావికా దళంలో చేరక ముందు ఐటి రంగంలో పని చేసింది.

ఎన్‌సిసి కాడెట్‌గా ఉన్నప్పటి నుంచి రిపబ్లిక్‌ డే పరేడ్‌పాల్గొంటున్న ఆమె ఈసారి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో మిగ్‌– 17 పైలెట్‌గా ఉన్న స్కాడ్రన్‌ లీడర్‌ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించనుంది. ఇక మేడ్‌ ఇన్‌ ఇండియా ఆకాశ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ సిస్టమ్‌కు లెఫ్టెనెంట్‌ ఆకాష్‌ శర్మ నాయకత్వం వహించనుంది. ‘చిన్నప్పటి నుంచి టీవీలో చూసిన పరేడ్‌లో ఈసారి నేను పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని శర్మ అంది. ఈ ముగ్గురు కాకుండా లెఫ్టినెంట్‌ డింపుల్‌ భాటి మోటార్‌ సైకిల్‌ విన్యాసాల దళంలో, మేజర్‌ మహిమ ‘కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌’ బృందాల నాయకత్వంలోపాల్గొననున్నారు.

మహిళా శకటాలు
ఈసారి పరేడ్‌లో 17 రాష్ట్రాల నుంచి, 6 మంత్రిత్వ శాఖల నుంచి, త్రివిధ దళాల నుంచి శకటాలుపాల్గొననున్నాయి. ఇవి కాకుండా డిఆర్‌డివో శకటం ఉంటుంది. అయితే వీటిలో చాలా శకటాలు ఈసారి మహిళా శక్తికి ప్రాధాన్యం,ప్రాముఖ్యం ఇచ్చాయి. మూడు సైనిక దళాలు ఈసారి మహిళా కేంద్రిత శకటాలను నడుపుతున్నాయి. టూరిజంలోనూ, సేంద్రియ వ్యవసాయంలోనూ స్త్రీల భాగస్వామ్యంలో వారి స్వయం సమృద్ధికిపాటుపడతాం అనే థీమ్‌తో త్రిపుర శకటం ఉండనుంది.

పశ్చిమ బెంగాల్‌ శకటం యునెస్కో గుర్తింపు పొందిన దుర్గా పూజను ‘మానవత్వానికి అమూర్త వారసత్వ సంపదగా’ అభివర్ణిస్తూ ముందుకు సాగనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘సకల సజీవిత్వాలను సమృద్ధి చేసే అమృత స్త్రీతత్వం’ థీమ్‌తో శకటం నడపనుంది. కేంద్ర హోమ్‌ శాఖ అయితే ఆరు కేంద్ర బలగాలలో స్త్రీ పోరాట పటిమను ప్రదర్శించే శకటంను ఎంచుకుంది.

కేరళ మహిళా సాక్షరత శకటాన్ని, కర్నాటక మహిళా స్వయం సమృద్ధి శకటాన్ని ఈ పరేడ్‌ దారుల్లో నడిపించనున్నాయి.

కళకళలాడే నృత్యాలు
వీరందరూ కాకుండా వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాలలో విద్యార్థునులు, యువతలు, మహిళా కళాకరులు విశేష సంఖ్యలోపాల్గొననున్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి మొదలు వీరంతా తమ సాంస్కృతిక విన్యాసాలను ప్రదర్శించనున్నారు.                 
 
లెఫ్టెనెంట్‌ ఆకాష్‌ శర్మ, స్కాడ్రన్‌ లీడర్‌ సింధు రెడ్డి, లెఫ్టినెంట్‌ కమాండర్‌ దిశా అమృత్‌ 

చారిత్రక దృశ్యం
దిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌ నేత్రపర్వంగా ఉండటమే కాదు, దేశభక్తి భావాలు ఉ΄÷్పంగేలా కూడా చేస్తుంది. ఈసారి రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రత్యేకత... సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్‌) ‘క్యామెల్‌ కాంటింజెంట్‌’లో తొలిసారిగా ΄ాల్గొంటున్న మహిళా సైనికులు...

దిల్లీలో ఘనంగా జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)కు చెందిన ‘క్యామెల్‌ కాంటింజెంట్‌’ 1976 నుంచి భాగం అవుతోంది. ఈసారి జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో మహిళా సైనికులు ‘క్యామెల్‌ కాంటింజెంట్‌’లో భాగం కావడం చారిత్రక ఘట్టం కానుంది.

గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇరవై నాలుగు మంది మహిళా సైనికులకు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో క్యామెల్‌ రైడింగ్‌లో శిక్షణ ఇచ్చి పన్నెండు మందిని ఎంపిక చేశారు.

‘రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ΄ాల్గొనడం ఒక సంతోషం అయితే క్యామెల్‌ కాంటింజెంట్‌లో భాగం కావడం మరింత సంతోషం కలిగిస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైన అంబిక. ‘రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో క్యామెల్‌ రైడర్స్‌ను చూసి అబ్బురపడేదాన్ని. ఇప్పుడు నేను అందులో భాగం కావడం గర్వంగా ఉంది’ అంటుంది సోనాల్‌.

విజయ్‌చౌక్‌ నుంచి ఎర్రకోట వరకు కర్తవ్యపథ్‌ మీదుగా క్యామెల్‌ రైడర్స్‌ కవాతు నిర్వహిస్తారు. రిపబ్లిక్‌డే తరువాత జరిగే రీట్రీట్‌ సెరిమనీలో కూడా ఈ బృందం ΄ాల్గొనబోతోంది. అమృత్‌సర్‌లో జరిగిన బీఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే పరేడ్‌లో ఈ బృందం ΄ాల్గొని ప్రశంసలు అందుకుంది.

ఉమెన్‌ రైడర్స్‌ కోసం ఆకట్టుకునే యూనిఫాంను కూడా రూ΄÷ందించారు. ప్రముఖ డిజైనర్‌ రాఘవేంద్ర రాథోడ్‌ దీన్ని డిజైన్‌ చేశారు. మన దేశంలోని వివిధ ్ర΄ాంతాలకు చెందిన క్రాఫ్ట్‌ ఫామ్స్‌ను ఈ డిజైన్‌ ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుంది. రాజస్థాన్‌లోని మెవాడ్‌ సంప్రదాయానికి చెందిన తల΄ాగా మరో ఆకర్షణ.

మన దేశంలో భద్రతావసరాలు, సాంస్కృతి కార్యక్రమాల్లో ఒంటెలను ఉపయోగిస్తున్న ఏకైక సైనిక విభాగం బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)

సాంస్కృతిక కార్యక్రమాల్లో బీఎస్‌ఎఫ్‌ క్యామెల్‌ కాంటింజెంట్‌ కవాతులకు ప్రత్యేకత ఉంది. ఉమెన్‌ రైడర్స్‌ రాకతో కవాతులలో రాజసం ఉట్టిపడుతుంది.

మేము సైతం: ఉమెన్‌ రైడర్స్‌, ఆకట్టుకునే యూనిఫాం: ప్రముఖ డిజైనర్‌ రాఘవేంద్ర రాథోడ్‌ డిజైన్‌ చేశారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top