నూజివీడు: మండలంలోని మిట్టగూడెం–లీలానగర్ గ్రామాల మధ్య శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని రాజస్థాన్‌కు చెందిన గోసాయి(25) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల ప్రకారం గోసాయి నూజివీడులోని బాలాజీ స్టీల్ ఫర్నిచర్స్లో పనిచేస్తాడు. పని నిమిత్తం విస్సన్నపేట వెళ్లిన అతను తిరిగి నూజివీడు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో గోసాయి కుడికాలు విరిగిపోయింది. స్థానికులు 112కి కాల్ చేయడంతో పాటు 108కి సమాచారం అందించడంతో 108 వాహనంలో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


