శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం

Nov 15 2026 1:08 PM | Updated on Nov 15 2026 1:08 PM

ద్వారకాతిరుమల: కార్తీకమాసం తొలి శనివారం, శ్రీవారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో చినవెంకన్న క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. పవిత్ర కార్తీకమాసంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో క్షేత్ర పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. దర్శన క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్‌ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ప్రసాదం కోసం కౌంటర్ల వద్ద, తలనీలాలు సమర్పించేందుకు కల్యాణకట్ట వద్ద భక్తులు బారులుతీరారు. కార్తీకమాస దీపారాధనలో భాగంగా ఆలయ ఆవరణలోని దీపారాధన మండపం వద్ద భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement