గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ | - | Sakshi
Sakshi News home page

గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ

ఏలూరు టౌన్‌: తల్లి మందలించిందనే కోపంతో తొమ్మిదేళ్ల బాలుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన చింతల కార్తికేయ (3వ తరగతి)ని తల్లి మందలించడంతో మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బాలుడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను సంప్రదించారు. దీనిపై ఏలూరు వన్‌టౌన్‌ సీఐ కే. రామకృష్ణ వెంటనే స్పందించారు. ఆయన పర్యవేక్షణలో స్మార్ట్‌ పోలీస్‌ బృందాన్ని రంగంలోకి దించి, గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం గంట వ్యవధిలోనే చిన్నారి ఆచూకీ గుర్తించి, క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. అనంతరం బాలుడికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి ఇంటికి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement