వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

టీడీపీ, జనసేనల నుంచి చేరికలు మైసన్నగూడెంలో చేరికలు

టీడీపీ, జనసేనల నుంచి చేరికలు

బుట్టాయగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురుగుమిల్లి గ్రామానికి చెందిన 10 టీడీపీ కుటుంబాలు శనివారం ఆ పార్టీని వీడి, వైఎస్సార్‌సీపీలో చేరాయి. మండలంలోని దుద్దుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి... కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి పాలనపై విసుగుచెందిన పలువురు నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సోయం వెంకటరామయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరేటి సత్యనారాయణ, నాయకులు బానోతు కృష్ణనాయక్‌, నక్కా శివాజీ, సీతప్పగూడెం ఎంపీటీసీ అభ్యర్థి మడకం జంపాలు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు వెట్టి పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం) : కూటమి ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో శనివారం టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి కుక్కల ధర్మరాజు, పార్టీ మండల అధ్యక్షుడు ఒరుగుంటి నాగేంద్ర సమక్షంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకుడు జెట్టి గురునాథరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ నుంచి కుక్కల సీతారామరాజు, నందిపాం సత్యేశ్వరరావు, తాడి నాగరాజు, సోపేటి రమేష్‌, పులపాకులు మధుబాబు, లింగగిరి సత్యబాబు, బుద్దాటి అశోక్‌, జుత్తుక నరసింహ, లింగగిరి గంగరాజు, జుత్తుక గంగరాజు, గంటా గంగరాజు, తలారి రాము, తలారి రామకృష్ణ, తలారి అర్జున్‌; జనసేన పార్టీ నుంచి నేలప్రోలు వంశీకృష్ణ, ఆరేటి యోహన్‌ తదితరులు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జెట్టి గురునాథరావు మాట్లాడుతూ.. మైసన్నగూడెం గ్రామం వైఎస్సార్‌సీపీకి పట్టుకొమ్మని, ఇక్కడ ఎంతో క్రమశిక్షణ గల ప్రజలు ఉన్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కొక్కల సీతారాం, సోమరాజు, ఇరూరి సర్వేశ్వరరావు, జనసేన నాయకులు వంశీకృష్ణ, నాగరాజులతో పాటు సుమారు 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలోకి రావడం పార్టీని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల బూత్‌ కమిటీల కన్వీనర్‌ బీవీఆర్‌ చౌదరి, జెట్టి సత్య ఆదిత్య, వైఎస్సార్‌సీపీ నాయకులు పంతగాని వెంకన్న, చీమకుర్తి శ్రీనివాసరావు, కుర్రు రవి, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మైసన్నగూడెంలో వైఎస్సార్‌ సీపీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న జెట్టి గురునాథరావు, ఒరుగుంటి నాగేంద్ర, కుక్కల ధర్మరాజు తదితరులు

దుద్దుకూరులో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలకు కండువాలు వేసి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement