తణుకు ఎన్టీఆర్ పార్కు ముఖద్వారంపై ఇలా..
వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదురుగా..
అధికార యంత్రాంగం ఎన్నికల కోడ్ నిబంధనలను సక్రమంగా అమలు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ నేటికీ తణుకు పట్టణ పరిధిలో కూటమి నేతల ఫ్లెక్సీలు జెండాలు పలు రహదారుల్లో దర్శనమిస్తున్నాయి. తణుకు రాష్ట్రపతి రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డు, సజ్జాపురం తదితర ప్రాంతాల్లో కూటమి నేతల ఫ్లెక్సీలు తొలగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారుల నిర్లక్ష్య ధోరణా లేక కూటమి నేతల మెప్పు కోసం ఎన్నికల కోడ్ నిబంధనలకు పాతరేస్తున్నారా అని ప్రజానీకం చర్చించుకుంటున్నారు. – తణుకు అర్బన్


