పారా గేమ్స్‌లో రవికార్తీక్‌ అద్భుత ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

పారా గేమ్స్‌లో రవికార్తీక్‌ అద్భుత ప్రదర్శన

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

పారా గేమ్స్‌లో రవికార్తీక్‌ అద్భుత ప్రదర్శన అట్టహాసంగా మాల్‌ఖంబ్‌ క్రీడా పోటీలు స్కూల్‌గేమ్స్‌ సెలెక్షన్లు వాయిదా

జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): జపాన్‌లో ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన 5వ ఆసియన్‌ పారా గేమ్స్‌ – 2026 స్విమ్మింగ్‌ విభాగంలో జంగారెడ్డిగూడెంకు చెందిన యువ ఈతగాడు బుడిగిన రవికార్తీక్‌ అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చారు. ఈ పోటీల్లో ఆయన 2 రజత, 1 కాంస్య పతకం సాధించి, భారత్‌ తరఫున ఒకే క్రీడాకారుడిగా అత్యధిక పతకాలు సాధించిన వ్యక్తిగా సరికొత్త రికార్డు సృష్టించారు. 18 ఏళ్ల చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం పట్ల ఆయన తండ్రి, న్యాయవాది బుడిగిన నాగేంద్రకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో రవికార్తీక్‌ 100 మీటర్ల ఫ్రీస్టైల్‌, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగాల్లో రెండు రజత పతకాలు, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో ఆయన 2027లో మెక్సికోలో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌తో పాటు, 2028లో అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగే పారా ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున పాల్గొనేందుకు అర్హత సాధించారు.

వీరవాసరం: స్థానిక ఎంఆర్‌కే జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో 70వ రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ 14, 17, 19 బాల బాలికల మాల్‌ఖంబ్‌ క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి ఓవీఎస్‌ అనిల్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలతోపాటు జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. పోటీల్లో 12 జిల్లాల క్రీడాకారులు, కోచ్‌ మేనేజర్లు 300 మంది పాల్గొన్నారని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బాజీంకి వెంకట శ్రీనివాస్‌ తెలిపారు. పోటీలు 26వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు సంబంధించి నిర్వహించనున్న వివిధ క్రీడల జట్ల ఎంపికల తేదీల్లో మరోసారి మార్పులు జరిగినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్క్వాష్‌ క్రీడకు సంబంధించి అండర్‌ 14, 17 జట్ల ఎంపికలు ఈనెల 27న లింగపాలెం మండలం కలరాయనగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో, సాఫ్ట్‌ టెన్నిస్‌ జట్ల ఎంపికలు 27న రంగాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతాయని తెలిపారు. అండర్‌ 17 బాలుర క్రికెట్‌ జట్టు ఎంపిక ఈ నెల 28వ తేదీన వంగూరులోని ఏఎన్‌ఎం క్రికెట్‌ అకాడమీలో జరుగుతాయన్నారు. 28వ తేదీన కరాటే అండర్‌ 14, 17 బాలబాలికల జట్ల ఎంపికలు ఏలూరులోని కాస్మోపాలిటన్‌ క్లబ్‌ ప్రాంగణంలో జరుగుతాయని తెలిపారు. 28వ తేదీన బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, కబడ్డీ, చెస్‌, యోగా అండర్‌ 17, 14 బాలబాలికల జట్ల ఎంపికలు ఉంగుటూరు మండలం నారాయణపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతాయన్నారు. ఈ నెల 29వ తేదీన అండర్‌ 14 ,17 స్విమ్మింగ్‌ జట్ల ఎంపికలు ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లో, అలాగే ఈ నెల 29వ తేదీన అండర్‌ 14 అథ్లెటిక్స్‌ బాలబాలికల జట్ల ఎంపికలు, ఖోఖో అండర్‌ 17, 14 బాలబాలికల జట్ల ఎంపికలు భీమడోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement