న్యూస్‌రీల్
గత ప్రభుత్వంలో అగ్రతాంబూలం
చంద్రబాబు మళ్లీ వెన్నుపోటు పొడిచారు. బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి, కోర్టుల్లో కొట్టేస్తారని పూర్తి అవగాహన ఉండి కూడా రిజర్వేషన్ కల్పించినట్లు స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం స్టంట్ షో చేశారు. కట్‌చేస్తే.. హైకోర్టు రిజర్వేషన్లను కొట్టివేయడంతో చంద్రబాబు ఎన్నికల ఎత్తుగడకు చెక్ పడింది.
శుక్రవారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఆరువారాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న క్రమంలో రిజర్వేషన్ల పేరి ట గంపగుత్తగా బీసీ ఓట్లను దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. గత వైఎస్సార్‌సీపీ హయాంలో సామాజిక న్యాయం సాధికారతే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో పదవులు కేటాయించారు. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా స్థానిక మొదలు మంత్రి పదవుల వరకు బీసీలకే సింహభాగం కేటాయించారు.
హైకోర్టులో చుక్కెదురు
బీసీ రిజర్వేషన్ జీఓను హైకోర్టు గురువారం కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని, గ్రామీణ ప్రాంతంలో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం కల్పించేలా జారీ చేసినరోపై అభ్యంతరాలు రావడం, హైకోర్టులో కేసు దాఖలు కావడంతో రాజ్యాంగ పరిధికి లోబడి రిజర్వేషన్ కల్పించలేదని, అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ఇచ్చిన జీఓలను హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో మరోసారి బీసీ రిజర్వేషన్లను ఎన్నికల అస్త్రంగా మలిచి లబ్ధి పొందాలనుకునే చంద్రబాబు సర్కారు ప్రయత్నాలపై సర్వత్రా మండిపడుతున్నారు.
బ్యాక్‌వర్డ్ కాదు.. బ్యాక్‌బోన్ అంటూ..
బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు.. సమాజానికి బ్యాక్ బోన్.. సామాజిక న్యాయమే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యమిచ్చారు. ఎమ్మెల్సీగా జయమంగళ వెంకటరమణను సామాజిక కోణంలోనే అవకాశం కల్పించారు. వడ్డీ కులస్తులకు శాసనమండలిలో అవకాశం కల్పిస్తామని పాదయాత్రలో మాట ఇచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జయమంగళ వెంకటరమణను ఎమ్మెల్సీ చేశారు. ఏలూరు జిల్లాపరిషత్‌ను కూడా ప్రత్యేకంగా బీసీలకు కేటాయించారు. తొలుత కవురు శ్రీనివాస్‌ను జెడ్పీ చైర్మన్‌గా పనిచేసి అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో బీసీ మహిళ గంటా పద్మశ్రీకి చైర్‌పర్సన్ అవకాశం కల్పించారు.
బాబు మార్కు వెన్నుపోటు
రిజర్వేషన్ల పేరిట వంచన
ఫలించని స్థానిక ఎన్నికల స్టంట్ షో
రిజర్వేషన్ కొట్టేస్తారని తెలిసే జీఓ పేరిట మభ్యపెట్టే హడావుడి
భగ్గుమంటున్న బీసీ సంఘాలు
వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యం
మంత్రి పదవులు మొదలు నామినేటెడ్ సీట్ల వరకూ సింహభాగం
ఉమ్మడి పశ్చిమలో సార్వత్రిక ఎన్నికల్లోనూ బీసీ వర్గాలకే పెద్ద పీట
బీసీలకు
34 శాతం రిజర్వేషన్లు
గత వైఎస్సార్‌సీపీ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పదవుల కేటాయింపులో బీసీలకు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యంపై జిల్లాలో చర్చ సాగుతుంది. మండల స్థాయి నేతలకు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లుగా, కొందరికి చైర్మన్లుగా పదవులు కట్టబెట్టారు. ఉమ్మడి పశ్చిమలో చూస్తే తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2019లో గెలిచిన కారుమూరి నాగేశ్వరరావుకు మంత్రి పదవి కట్టపెట్టారు. అలాగే జెడ్పీటీసీగా ఉన్న కవురు శ్రీనివాస్‌ను జెడ్పీ చైర్మన్‌గా, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త, ఆ తరువాత శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులు ఐదుకి పైగా జిల్లాకు చెందిన బీసీలకే దక్కాయి.బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుకు తిరుమల తిరుపతి దేవస్ధాన పాలకమండలి సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు, పాలకొల్లు నుంచి గూడాల గోపి, నరసాపురం పార్లమెంట్ నుంచి గూడూరి ఉమాబాల, ఏలూరు పార్లమెంట్ నుంచి కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌కు అవకాశం కల్పించారు. మున్సిపాల్టీల్లోనూ బీసీలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏలూరు నగర మేయర్ స్థానం జనరల్ కేటగిరీ అయినా బీసీ మహిళ షేక్ నూర్జహాన్‌కు అవకాశం కల్పించారు. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్‌గా బత్తిన నాగలక్ష్మి, నరసాపురం మున్సిపల్ చైర్మన్ గా బర్రి వెంకటరమణ, ఆకివీడు నగర పంచాయతీ మొదటి మున్సిపల్ చైర్మన్‌గా జామి హైమావతిలకు అవకాశం కల్పించారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు పెద్ద సంఖ్యలో పదవులు దక్కాయి. జనరల్ కేటగిరీలో కూడా పలుచోట్ల బీసీలకు అవకాశాలను కల్పించారు. గత 50 ఏళ్ల చరిత్రలో జిల్లాలో బీసీలకు ఈ స్థాయిలో ప్రాధాన్యం ఏ రాజకీయ పార్టీ కల్పించలేదు.


