విభిన్న ఆలోచనలతో ఆవిష్కరణలు | - | Sakshi
Sakshi News home page

విభిన్న ఆలోచనలతో ఆవిష్కరణలు

Oct 2 2026 1:10 AM | Updated on Oct 2 2026 1:10 AM

తాడేపల్లిగూడెం: విద్యార్థుల విభిన్న ఆలోచనలతో అద్భుత ఆవిష్కరణలు పుట్టుకు వస్తాయని ఏపీ నిట్‌ డీన్‌ ప్లానింగ్‌ డెవలప్‌మెంట్‌ డాక్టర్‌ సందీప్‌ అన్నారు. గురువారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఇంటర్‌ విద్యార్థులు ఏపీ నిట్‌కు వచ్చారు. వారితో సందీప్‌ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాల్లోని విషయాలను చదవడంతో పాటు వాటిని ఆచరణలో పరిశీలించినప్పుడే పూర్తి అవగాహన ఏర్పడుతుందన్నారు. ప్రశ్నించే తత్త్వం, పరిశోధనా దృక్పథాన్ని చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలన్నారు. విద్యార్థినులు తమలోని ఆసక్తి, ప్రతిభను సాంకేతిక పరిజ్ఞానంతో మేళవిస్తే దేశ అభివృద్ధికి ఉపయోగపడే ఎన్నో వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయన్నారు. అనంతరం సందీప్‌ను సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement