పరిశ్రమలకు రాయితీలు | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు రాయితీలు

Oct 2 2026 1:10 AM | Updated on Oct 2 2026 1:10 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిలాల్లో 13 పరిశ్రమలకు వివిధ రాయితీల కింద రూ.4.95 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుం టున్నామన్నారు. గత నెల రోజుల్లో జిల్లాలో 55 అనుమతులు మంజూరు చేశామన్నారు. జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రెండో విడతగా 192 లక్ష్యానికి 72 యూనిట్లను గుర్తించామని, వాటిలో 53 మంజూరు కాగా, వివిధ బ్యాంకుల్లో 20 పెండింగులో ఉన్నాయన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్ర జీఎం ఆర్‌.వెంకటరావు, ఐటీడీఏ పీడీ రాములు నాయక్‌ పాల్గొన్నారు.

రూ.600 కోట్ల ఎంఓయూలు

గుంటూరులో ఈనెల 16న జరిగే అమరావతి ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో జిల్లా నుంచి రూ.600 కోట్ల విలువైన ఎంఓయూలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాట్లపై జేసీ అభిషేక్‌ గౌడతో కలిసి సమీక్షించారు. జిల్లా నుంచి ఎంఎస్‌ఎంఈ, మధ్యతరహా, భారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భారీఎత్తున ఎంఓయూలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామిక వేత్తలకు సహకారం అందించేలా కలెక్టరేట్‌లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement