జాతీయ రహదారి.. తటాకంలా మారి..! | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారి.. తటాకంలా మారి..!

Sep 23 2026 12:43 AM | Updated on Sep 23 2026 12:43 AM

కై కలూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద రోడ్డుపై మురుగు నీరు..

కై కలూరు గోళితోట వద్ద..

కై కలూరు: పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి (165) చిన్నపాటి వర్షానికి తటాకంలా మారుతోంది. కై కలూరు పంచాయతీ ప్రారంభం నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వరకు పలు ప్రాంతాల్లో రోడ్డు దెబ్బతింది. డ్రెయినేజీ సమస్య వల్ల ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో రోడ్డుపై నీరు నిలిచిపోతుంది. సంత మార్కెట్‌ సమీప గోళితోట ఎదురుగానూ ఇదే పరిస్థితి. జాతీయ రహదారి సమీపంలో డ్రెయిన్లు పూడకపోవడమే సమస్యకు కారణంగా కనిపిస్తోంది. కరంమిల్లుల వీధి సమీపంలో పలు రోజులుగా డ్రెయిన్‌ నీరు రోడ్డుపైకి చేరుతుంది. పలు వీధుల్లో డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. మంగళవారం జాతీయ రహదారి అధికారులు ఆర్‌సీఎం చర్చి వద్ద డ్రెయిన్‌ను పరిశీలించారు.

కర్ర పెత్తనంతోనే సమస్యలు : కై కలూరు పంచాయతీలో నిధుల వినియోగంలో అవకతవకలు, కేసులు, విచారణలతో ఇక్కడ పనిచేయడానికి అధి కారులు రావాలంటేనే భయపడుతున్నారు. రాజకీయ నేతలు ఆదేశాలు జారీ చేస్తున్నా.. నిబంధనలు పాటించపోతే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయని అధికారులు భయపడుతున్నారు. ఇదిలా ఉండగా కర్రపెత్తనం చేసే వ్యక్తులు పంచాయతీలో ఎక్కువయ్యారు. సమస్యను పరిష్కరిస్తున్నట్టు బిల్డప్‌ ఇవ్వడం, ఎమ్మెల్యే దగ్గర గొప్పలు చెప్పడానికి కొందరు తయారవుతున్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ పంచాయతీ 20 వార్డుల్లో ఇటీవల మోటారు సైకిల్‌పై పర్యటించి పారిశుద్ధ్యం, డ్రెయినేజీ, ఆక్రమణల సమస్యలను పరిష్కారానికి కమిటీలు ఏర్పాటుచేశారు. అయినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రతిపక్ష పార్టీలతో పాటు కూటమి పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కై కలూరులో అధ్వానంగా డ్రెయినేజీ వ్యవస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement