నకిలీ విత్తనాలతో మునిగాం
నకిలీ మొక్కజొన్న విత్తనాలతో తమను మోసం చేసిన ఆర్గనైజర్‌పై చర్యలు తీసుకోవాలని, పరిహారం ఇప్పించాలంటూ రైతులు నిరసన తెలిపారు. 8లో u
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని పురపాలక సంఘాలు, ఏలూరు నగరపాలక సంస్థలో రూ.122 కోట్ల హెచ్‌ఏఎం నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి మంగళవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పనులకు సీఎం చంద్రబాబు కుప్పం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి పట్టణాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అధికారులు తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరులో రూ.50 కోట్లు, జంగారెడ్డిగూడెంలో రూ.19 కోట్లు, నూజివీడులో రూ.35 కోట్లు, చింతలపూడిలో రూ.18 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, కమిషనర్ ఎ.భానుప్ర తాప్, ఏలూరు ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు పాల్గొన్నారు.


