● రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన
● జోన్–2 పరిధిలో ఈనెల 27న భారీ సభ
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో బీసీలను బ్యాక్‌బోన్ క్లాస్‌గా.. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తే.. నేడు టీడీపీ కూటమి ప్రభుత్వం బీసీలను ఎంత దారుణంగా వంచన చేసిందో తెలి యజేస్తూ.. బీసీల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు బీసీ గర్జన సభను నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ఏలూరు నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు తెలిపారు. ఏలూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరా లు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హ యాంలో ఐదేళ్లలో బీసీ వర్గాల నేతలకు అన్ని రంగాల్లోనూ సముచిత స్థానం కల్పిస్తూ బీసీ అభ్యున్నతికి పాటుపడింది మాజీ సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. గతంలో ఏలూరులో రాష్ట్రస్థాయిలో బీసీ గర్జన సభ నిర్వహించారనీ, హామీలన్నీ నెరవేర్చి చూపించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.
ఈనెల 27న రాజమండ్రిలో..
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈనెల 27న ఉదయం 10 గంటలకు వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన నిర్వహిస్తున్నామని చిరంజీవి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని కాతేరు రోడ్డులో బీసీ గర్జన సభ ఏర్పాటు చేశారని తెలిపారు. జోన్–2 పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రిలో గర్జన సభ నిర్వహిస్తారన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని బీసీలంతా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీ ముఖ్యుల హాజరు
బీసీ గర్జన సభకు ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్‌యాదవ్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు హాజరవుతారని చిరంజీవి తెలిపారు. ప్రజలకు 2024లో టీడీపీ కూటమి నేతలు అనేక హామీలను గుప్పించారనీ, అధికారంలోకి వచ్చి 27 నెలలు కావచ్చినా నేటికీ హామీల అమలుపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రెండేళ్లు దాటినా నేటికీ సంక్షేమ పథకాల ఊసులేదనీ, బీసీలకు చేసిందేమిటో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఉంగుటూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు తుమ్మగుంట రంగా, దెందులూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మట్టా రవిశంకర్, రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి కిలారపు బుజ్జి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర గ్రీవెన్స్‌సెల్ కార్యదర్శి బసవ, జిల్లా కార్యదర్శి సాసుపల్లి యుగంధర్‌ప్రసాద్, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, మరడాని అనిల్, ఎదలాడ నాని, బీసీసెల్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.


