ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 10 గంటలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.శ్రీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల సమర్థవంత అమలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకత్వం తదితర కార్యక్రమాలకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై అవగాహన కలిగిస్తారన్నారు.
గణపవరం: అరుణాచలప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకు అధికారులు శుక్రవారం ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ది చేబ్రోలు విశాల సహకార సంఘాన్ని సందర్శించారు. సొసైటీ ఎన్‌పీఏ మేనేజ్‌మెంట్ వ్యవహారాల గురించి అడిగి తెలుసుకున్నారు. సొసైటీ చైర్మన్ కడియాల రవిశంకర్, సీఈఓ అయ్యంకి రంగనగేష్ వారికి బ్యాంకు నిర్వహణ, పనితీరు. తదితర విషయాలపై అవగాహన కల్పించారు. బ్యాంకును సందర్శించిన వారిలో అరుణాచలప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ ఎండీ, జీఎం, డీజీఎం ఉన్నారు.
తణుకు అర్బన్: న్యాయవాదులపై దాడులను ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆల్ ఇండియా లాయర్స్ యూ నియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన ము నిస్వామి హెచ్చరించారు. అనంతపురంలో న్యాయవాదిపై సీఐ దాడి చేయడానికి వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి బార్ అసోసియేషన్ భవనం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో 45 వేల మంది న్యాయవాదులు ఉండగా వృత్తి రక్షణకు చట్టం చేయకపోవడం విచారకరమన్నారు. తె లంగాణలో ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని చేసిందని గుర్తుచేశారు. ఆల్ ఇండియా లాయర్ సిమ్ జిల్లా కమిటీ సభ్యుడు కౌరు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఆర్.వెంకటేశ్వరరావు, కంచర్ల సురేష్, కేఎల్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: ఆలయ భూములను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేస్తూ వెబ్ ల్యాండ్‌లో నమోదు చేయాలని జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.హరి సూర్యప్రకాష్ అన్నారు. జిల్లాలో ఆలయ ఈఓలతో శుక్రవారం భీమవరంలో సమావేశం నిర్వహించారు. ఆడిట్ నివేదికల్లో అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశానికి హిందూ ఆలయాల పరిరక్షణ సమితి సభ్యులు హాజరై ఆలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆలయ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పిల్లాడి రుద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొత్తూరి రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు, చైతన్య వర్మ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంచి సుస్థిర జీవన శైలిని అలవర్చడంలో గ్రీన్ టీచర్స్ పాత్ర ప్రధానమైందని సమగ్ర శిక్ష ఏ ఎంఓ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం భీమవరం డివిజన్ పరిధిలోని 10 మండలాల హైస్కూళ్ల గ్రీన్ టీచర్స్‌కు పాఠశాలల్లో పర్యావరణ కార్యక్రమాల నిర్వహణపై ఏఆర్‌కేఆర్ ము న్సిపల్ స్కూల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. నేషనల్ గ్రీన్‌కోర్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎ.రవీంద్ర మాట్లాడుతూ ప్రకకృతి కనెక్ట్ యాప్‌లో కార్యక్రమాల వివరాలను అప్‌లోడ్ చేయడంతోపాటు విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. క్లస్టర్ కో–ఆర్డినేటర్లు నాగలక్ష్మి పాల్గొన్నారు.


