గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు

Sep 19 2026 12:52 AM | Updated on Sep 19 2026 12:52 AM

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు

తణుకు అర్బన్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తణుకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తికి ఉందుర్తి పాల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం సమీపంలోని పంపనవారిపాలెం పెట్రోలు బంక్‌ వద్ద సుమారు 42 ఏళ్ల వయస్సున్న ఈ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆచూకీ, కుటుంబ వివరాలు లభ్యం కాకపోవడంతో పోలీసుల సూచనల మేరకు అంతిమ సంస్కారాలు చేసినట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ ఉందుర్తి ప్రసన్నకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement