న్యూస్‌రీల్
చినవెంకన్నకూ ధరల భారమే!
నిత్యావసర వస్తువుల ధరల సెగ ద్వారకాతిరుమల చినవెంకన్నకూ తగులుతోంది. ప్రసాదం తయారీ, నిత్యాన్నదానంపై ధరల ప్రభావం చూపుతోంది. 8లో u
శురకవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఏఐ సృష్టించిన చిత్రం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: టన్ను రొయ్యలు సాగు చేయాలంటే.. టన్నున్నర మేత కావాలి.. ఇదే సిండికేట్ వ్యాపారులకు ఆదాయ వనరు. ఫీడ్, సీడ్ కంపెనీల నిర్వాహకులు ఒకరే కావడంతో అందరూ సిండికేట్‌గా మారి అడ్డగోలుగా ఆక్వా మేత ధరలు పెంచుతున్నారు. గత 8 నెలల కాలంలో నాలుగు విడతల్లో వనామీ రకం రొయ్యల మేత రూ.30, టైగర్ రకం రొయ్యల మేత ధర రూ.35కు పెరిగింది. తాజాగా వనామీ రకం మేతపై టన్నుకు రూ.9 వేలు, టైగర్ రొయ్యల మేత పై రూ.12లు పెంచి మరోసారి ఆక్వా రైతుల నడ్డివిరగ్గొట్టారు. కేవలం రేటు పెంపు వల్ల మళ్లీ ఆక్వా రైతులపై రూ.వెయ్యి కోట్లకుపైనే అదనపు భారం పడింది. ఇక మేత పెంపు వల్ల ప్రస్తుత కౌంట్ ధరలకు అనుగుణంగా క్వింటాల్ రొయ్యలకు సగటు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు.
35 నియోజకవర్గాల్లో ఆక్వా సాగు
రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం అధికంగా ఉన్న 35 నియోజకవర్గాల్లో ఆక్వాసాగు సుమారు 5 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఉభయగోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో ఆక్వాసాగు జరుగుతుండగా సింహభాగం సాగు 2.63 లక్షల ఎకరాలు ఒక్క పశ్చిమగోదావరిలోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 8 నుంచి 8.50 లక్షల టన్నుల రొయ్యలు రాష్ట్రం నుంచి అమెరికా, యూరప్, చైనా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రధానంగా 40 కౌంట్ దేశీయ రొయ్యకు అమెరికాలో మంచి మార్కెట్ ఉండటంతో ఎక్కువ అమెరికా ఎగుమతులపైనే సిండికేట్ కంపెనీలు దృష్టి పెడుతుంటాయి. ఒక్క పశ్చి మగోదావరి జిల్లాలోనే సుమారు 65 వేల మంది రైతులు ఆక్వాసాగులో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షలకు పైనే ఆక్వారంగంలో ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. గతేడాదిగా ఆక్వా ధరలు భారీగా పతనం, మేతల ధరలు భారీగా పెరుగుదలతో రైతులు తీవ్ర అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జూలైలో మేత ధరలను భారీగా పెంచారు. కిలోకు రూ.14 నుంచి 16కు పెంచగా రైతు లు, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఆందోళనలతో కిలోకు రూ.2లు తగ్గించారు. సరిగ్గా నెల రోజులు దాటగానే మళ్లీ ఽమేత ధరలను పెంచేశారు.
సిండికేట్ మాఫియాలో అప్సడా
గత ప్రభుత్వ హయాంలో 2020లో ఆక్వాసాగు అభివృద్ధి సంస్థ (అప్సడా)ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటుచేస్తూ చట్టం తీసుకువచ్చారు. ఆక్వా రంగంలో సీడ్, ఫీడ్, మందుల రేట్లు, ప్రాసెసింగ్, కొనుగోలు ధరలతో పాటు ఏ సమస్య వచ్చినా రైతులకు అండగా నిలిచేలా అప్సడా పని చేసేలా తీర్చిదిద్దారు. కూటమి ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చిన తరువాత సీడ్, ఫీడ్ రెండు కంపెనీలు ఒకరే యజమాని కావడం, సింహభాగం కంపెనీలు చంద్రబాబు సానుభూతిపరులవే కావడంతో సిండికేట్ మాఫియాలో అప్సడా నలిగిపోతుంది. పలుమార్లు ఆక్వా రైతులు తారాస్థాయిలో నిరసనలు తెలిపినా అప్సడా స్పందించని పరిస్థితి. మేత ధరలు, పంట ధరలు అన్ని సిండికేటే నిర్ణయించడంతో ఆక్వా రైతులు క్రాప్ హాలిడే బాట పడుతున్నారు.
ధరల పెంపు
దారుణం
సిండికేట్ రాజ్యం
సహించం
ఫీడ్‌యించుకు తినేలా !
మళ్లీ ధరల బాదుడు
కిలో వనామీ మేత రూ.9, టైగర్ మేత రూ.12కు పెంపు
8 నెలల్లో కిలోకు రూ.35 వరకు రేట్ల పెంపు
ఫీడ్, సీడ్ కంపెనీలు ఒకటే కావడంతో ఇష్టారాజ్యం
ఆక్వారంగంపై పట్టుకోల్పోతున్న అప్సడా
ఎకరాకు సగటున రూ.50 వేల వరకు రైతుకు నష్టం


