తీవ్ర సంక్షోభంలోకి ఆక్వా రంగం | - | Sakshi
Sakshi News home page

తీవ్ర సంక్షోభంలోకి ఆక్వా రంగం

Sep 4 2026 1:06 AM | Updated on Sep 4 2026 1:06 AM

యలమంచిలి: ఆక్వారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంక్షోభంలోకి నెడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. గురువారం పాలకొల్లులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగానికి ఎలాంటి సహకారం అందడం లేదన్నా రు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆక్వాకు రూ.1.50కే సబ్సిడీ విద్యుత్‌, అప్సడా చట్టం ద్వారా ఫీడ్‌, సీడ్‌ ధరల నియంత్రణ, స్థానిక అమ్మకాలు పెంచేలా ఫిష్‌ ఆంధ్ర, మ త్స్యశాఖ అధికారుల ద్వారా సూచనలు, సలహాలు అందించేలా రైతులకు మేలు చేశారన్నారు. అలాగే నరసాపురంలో ఆక్వా వర్సిటీని తీసుకువచ్చారన్నారు. అయితే ప్రస్తుత కూటమి పాలనలో గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా విపత్కర పరిస్థితులను ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎని మిది నెలల్లో మేతల ధరలు కిలోకు రూ.28 వరకు పెరగడంతో రైతులకు తీవ్రం భారం పడుతోందన్నారు. ఆక్వారంగాన్ని కాపాడాలంటూ రైతులు రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేయడంతో పాటు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారన్నారు.

ఆక్వా వర్సిటీని అటకెక్కించి..

అప్సడా మాజీ వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురామ్‌ మాట్లాడుతూ ఆక్వాకు మేలు చేసేలా రూ.100 కోట్లతో నరసాపురంలో ఆక్వా వర్సిటీని ఏర్పాటుచేస్తే.. కూ టమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్ట ఇసుక, ఒక్క సిమెంట్‌ బస్తా పని కూడా చేయలేదన్నారు. సీడ్‌, ఫీడ్‌ కంపెనీలన్నీ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారివే కావడంతో కంపెనీలు చెప్పిందే చె ల్లుతోందన్నారు. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారన్నారు. ట్రంప్‌ ఆక్వా ఎగుమతులపై 50 శాతం సుంకం వేస్తే రొ య్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు నష్టపోతాయని, సబ్సిడీ రూపంలో ఏదైనా చేయండని కేంద్రానికి ఉత్తరం రాసిన చంద్రబాబు.. ఇప్పుడు మేత ధరలు తగ్గించాలని ఫీడ్‌ కంపెనీలకు ఎందుకు ఉత్తరం రాయలేదని రఘురాం ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ పోరాటం

వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) మాట్లాడుతూ ఆక్వా రైతులకు న్యాయం చేసేలా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.

వైఎస్సార్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement