జిల్లా ప్రజా రవాణా అధికారిగా సుబ్రహ్మణ్యం | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రజా రవాణా అధికారిగా సుబ్రహ్మణ్యం

Sep 4 2026 1:06 AM | Updated on Sep 4 2026 1:06 AM

జిల్లా ప్రజా రవాణా అధికారిగా సుబ్రహ్మణ్యం పంచాయతీ కార్మికుల ధర్నా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా కానుకొలను సాధారణ స్థితికి గోదావరి ఐటీఐలో ప్రవేశాలకు ఆహ్వానం

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లా ప్రజారవాణా అధికారిగా అడ్డాల సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు చేపట్టారు. ఎస్‌.గిరిధరకుమార్‌ గతనెల 31న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో తిరువూరు డిపో మేనేజర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై సుబ్రహ్మణ్యం ఇక్కడకు వచ్చారు. కార్యాలయ, డిపో సిబ్బంది, యూనియన్ల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌ సీహెచ్‌ నాగరా ణిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జి ల్లాలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపే తం చేసి, ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందేలా చర్యలు తీ సుకోవాలని కలెక్టర్‌ సూచించారు. మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని సుబ్రహ్మణ్యం అన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం కలెక్టరేట్‌ వద్ద పంచాయతీ కార్మికులు గురువారం ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ పంచాయతీల్లో స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, వెహికల్‌ డ్రైవర్స్‌ ఎలక్ట్రీషియన్లు, బిల్‌ కలెక్టర్లు, అటెండర్లు యాళ్ల తరబడి చాలీచాలని జీతాలతో బతుకుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో తమను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమకు యూనిఫామ్‌, చెప్పులు, సబ్బులు, నూనెలు, కనీసం గ్లౌజులు, మాస్కులు కూడా ఇవ్వడం లేదన్నారు. టెండర్‌ విధానం రద్దు చేయాలని, కనీసం రూ.26 వేల వేతనం, గుర్తింపు కా ర్డులు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు తదితర డి మాండ్లను వివరించారు. జిల్లాలోని పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

వీరవాసరం: మండలంలోని రాయకుదురు జె డ్పీ హైస్కూల్‌ ప్లస్‌ ప్ర ధానోపాధ్యాయుడు కానుకొలను శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారని గురువారం హైస్కూల్‌ సిబ్బంది తెలిపారు. ఆయన 2017లో ధర్మారావు ఫౌండేషన్‌ (పాలకొల్లు) ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, 2019లో ఆంధ్రప్రదేశ్‌ సోషల్‌ సైన్సెస్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ద్వారా స్టేట్‌ లెవెల్‌ బెస్ట్‌ సోషల్‌ టీచర్‌ అవార్డును, 2022–23లో పాలకొల్లు లయన్స్‌ క్లబ్‌ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2023లో సర్వేపల్లి రాధాకృష్ణ బెస్ట్‌ టీచర్‌ అవార్డును అందుకున్నారని చెప్పారు. 2025లో జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు అవార్డును పొందరన్నారు.

పోలవరం రూరల్‌: గోదావరిలో వరద ప్ర వాహం క్రమేపీ తగ్గుతూ సాధారణ స్థితికి చేరుకుంటోంది. నదీ పరీవాహక ప్రాంతాల్లో, ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నదిలోకి చేరే నీటి పరిమాణం తగ్గుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 28 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వేకి చెందిన 48 గేట్ల ద్వారా 1.63 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నూజివీడు: స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రధానాధికారి రజిత గురువారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఆపైన చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తు కాపీని ప్రింట్‌ తీసుకుని, 7న జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు, కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.

ఆరేడులో శాస్త్రవేత్తల బృందం

ఉండి: మండలంలోని ఆరేడులో గురువారం జలచర వ్యాధుల జాతీయ పర్యవేక్షణ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు, అధికారుల బృందం పర్యటించింది. జిల్లాలో ఆక్వా వ్యాధులు ప్రబలుతున్నాయనే సమాచారం మేరకు ఆగర్రు, మోడుగుల, సరిపల్లె, నిడమర్రు, ఉండి మండలం ఆరేడులోని రొయ్యల చెరువులను బృంద సభ్యులు పరిశీలించి రొయ్యల నమూనాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement