ఏలూరు (టూటౌన్): ‘సీఎం సార్, మా డబ్బులు మాకివ్వండి’ అంటూ ఉద్యోగులు గళమెత్తారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కూడా జిల్లాలో ఉద్యోగులు నల్ల బ్యా డ్జీలతో విధులకు హాజరయ్యారు. వాట్సాప్ డీపీ (ప్రొఫైల్ ఫొటో)లో ‘సీఎం సార్, మా డబ్బులు మాకివ్వండి’ అని నిరసన కొనసాగించడంతో పాటు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఏలూరు కలెక్టరేట్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం, నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు. ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ కె.రమేష్‌కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలన్నారు. ఉద్యోగులకు కనీ సం 30 శాతానికి తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని, ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. మొత్తంగా ఉద్యోగులకు రావాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిలపై స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలన్నారు. జనరల్ సెక్రటరీ బి.రాంబాబు, రె వెన్యూ సర్వీసెస్ అస్సోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎ.ప్రమోద్‌కుమార్, మహిళా విభాగం చైర్‌పర్సన్ గీతిక, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ భాశీరా, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన


