బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

Aug 16 2026 2:03 AM | Updated on Aug 16 2026 2:03 AM

బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

దెందులూరు: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ ఉద్యోగి కాలును కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు రూరల్‌ మండలం పాలగూడెం గ్రామానికి చెందిన మాత్రపు సతీష్‌ ఆశ్రం ఆసుపత్రిలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పాలగూడెం రైల్వే గేటు సమీపంలోని హోటల్‌ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్‌ కుడికాలు కింద భాగం తెగి దూరంగా పడిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో క్షతగాత్రుడిని వెంటనే ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి గుంటూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement