ఉద్యమ కెరటం ఎగసిన నేల | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ కెరటం ఎగసిన నేల

Aug 15 2026 12:40 AM | Updated on Aug 15 2026 12:40 AM

కలుషిత నీరు తాగి చిన్నారులకు అస్వస్థత దానిమ్మ గింజలతో అలంకరణ వినతుల స్వీకరణ స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

న్యూస్‌రీల్‌

జిల్లాలో వేడుకలు ఇలా..

క్విట్‌ ఇండియా ఉద్యమంలో నాన్న

జాతీయోద్యమ స్ఫూర్తితో రగిలిన పోరాట కెరటం స్వాతంత్య్రం వచ్చే వరకూ కొనసాగింది.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించింది.. గాంధీజీ, నేతాజీ ఈ నేలపై నడయాడి సమరోత్సాహాన్ని ప్రజల్లో రేకెత్తించారు.. దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించేందుకు ఇక్కడి వారి తమ వంతు పాత్ర పోషించారు.. పంద్రాగస్టు సందర్భంగా జిల్లాకు చెందిన సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం.

శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026

బుట్టాయగూడెం: కలుషిత నీరు తాగి 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంలో చో టుచేసుకుంది. తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పి.అంకంపాలేనికి చెందిన చిన్నారులు 12 మంది స్థానిక ఎంపీపీ పాఠశాలలో శుక్రవారం పంచాయతీ నుంచి వచ్చే తాగునీరు తాగారు. వారికి కడుపునొప్పి, కడుపులో వికారం ఉండటంతో హుటాహుటిన జీలుగుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఉదయం గ్రామానికి సంబంధించిన పంచాయతీ వాటర్‌ ట్యాంకులో కలుపు ముందు కలిసి ఉండటంతో ఈ సంఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా నగరంలోని ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. స్థానిక పత్తేబాద కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దానిమ్మ గింజలతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకుడు ప్రయాగ వెంకట రామమూర్తి పూజాదికాలు నిర్వహించారు. ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌ పృధ్వీ సత్యనారాయణమూర్తి, ఈఓ నల్లూరి సతీష్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

దెందులూరు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఒక నెల, నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌ గౌడ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి అ ధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే చింతమనేని, అధికారులు పాల్గొన్నారు.

పోలవరం రూరల్‌: గోదావరి వరద మళ్లీ స్వ ల్పంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే వద్ద 28 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 2.28 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది.

కై కలూరు : బ్రిటీష్‌ పాలనలో ఏలూరు మిలట్రీ స్టేషన్‌గా ఉండేది. రాజమండ్రి గోదావరి జిల్లాలకు ప్ర ధాన కేంద్రంగా ఏలూరు పేరుగడించింది. ఈ పట్టణానికి 1937లో మహాత్మాగాంధీ, 1940లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విచ్చేసి స్వాతంత్య్ర సమరోత్సాహాన్ని ప్రజల్లో రేకిత్తించారు. ఏలూరు జిల్లా పెదపాడుకు చెందిన గారపాటి సత్యనారాయణ, చిన నిండ్రకొలనకులో చింతలపాటి పరప్రసాద మూర్తిరాజు, భీమడోలు మండలం గుంగుగొలునులో మంగళంపల్లి చంద్రశేఖర్‌, మండవల్లి మండలం కాకతీయనగర్‌కులో ఉప్పాల కోదండరామయ్య, పశ్చిమగోదావరి జిల్లా కుముదవల్లికి చెందిన వేగిరాజు సత్యనారాయణరాజు, అయి భీమవరానికి చెందిన అద్దాల రాఘవరాజు, భీమవరానికి చెందిన షేక్‌ అలీ సాహెబ్‌ వంటి స్వాతంత్య్ర సమరయోధులు పోరాట పఠిమను చూపారు.

సమరయోధుల రక్తం చిందించిన గడ్డ

బ్రిటీష్‌ సామ్రాజ్యానికి వెన్నులో వణుకు పుట్టించిన స్వాతంత్య్ర పోరాటాల్లో కైకలూరు తాలూకా యోధులు ఎక్కువగా ఉన్నారు. పోలీసుల లాఠీదెబ్బలకు రక్తం చిందించారు. స్వాతంత్య్రం సిద్ధించినందుకు గుర్తుగా అప్పట్లో కై కలూరు పాఠశాల వద్ద ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటుచేశారు. కై కలూరు వంచాయతీ తాలూకా పరిధికి చెందిన ఘంట పేరయ్య, కంతేటి కాశీ విశ్వనాథం, మాగంటి నా యుడమ్మ, గొట్టుముక్కుల సూర్యనారాయణరాజు, మాగంటి సత్యనారాయణ, రుద్రరాజు సత్యనారాయణరాజు, చిర్రవూరి అచ్చుతరామయ్య, పొన్నాడ శ్రీరామచంద్రుడు, మేక తిరుపతయ్య, గుంటూరు రామదాసు, ఉన్నూరి నరసింహరాజు స్వాతంత్య్ర పోరులో అలుపెరుగని పోరాటం చేశారు.

గోదావరి తీరంలో ఉప్పు సత్యాగ్రహం

గాంధీజీ 1930లో ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన భూమిక పోషించింది. పుచ్చలపల్లి సుందరయ్య, సర్దార్‌ దండు నారాయణరాజు, పూరి గోవిందాచార్యులు, భూపతిరాజు సుబ్బరాజు, తల్లాప్రగడ వి శ్వసుందరమ్మ, పసల కృష్ణమూర్తి, మంగినపూడి పు రుషోత్తమశర్మలు మట్లపాలెం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించారు. పాలకుల నుంచి స్పందన లేకపో వడంతో తిరిగి 1932లో ఉప్పు సత్యాగ్రహాన్ని దాసరి కృష్ణవేణి, పసల అంజిలక్ష్మి, మూల్పూరి చుక్క నమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయిమ్మ వంటి మహిళలు ప్రారంభించారు. గాంధీజీ 1933 డిసెంబర్‌ 7న పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చారు.

దెందులూరు: సమష్టి కృషితో అవినీతి లేని సమాజం సాధ్యమని ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజ యప్రతాప్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం గోపన్నపా లెం పంచాయతీలోని ప్రైవేట్‌ కళాశాలలో జరిగిన సోషల్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. యువతతో పాటు ప్రతిఒక్కరు ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలన్నారు. యువత సమయాన్ని వృథా చేయకుండా ఉజ్వల భవిష్యత్తుకు లక్ష్యాలను ఎంచుకుని శ్రమించాలన్నారు. ఎందరో ప్రాణత్యాగంతో సిద్ధించిన దేశంలో అవినీతి ఆందోళన కలిగించే అంశమన్నారు.

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే జిల్లా, మండల కేంద్రాల్లోనూ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఇంటిపై, వాణిజ్య సముదాయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

సమష్టి కృషితోనే అవినీతిరహిత సమాజం

మా తండ్రి ఉప్పాల కోదండ రామయ్య 1915లో జన్మి ంచారు. గాంధీజీ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పట్లో రాజమండ్రి సెంట్రల్‌ జైలు నిండిపోవడంతో తెనాలిలో ఆయన్ను బంధించారు. మా నాన్న ఆచార్య రంగా ప్రియశిష్యుడిగా ఉ న్నారు. ఆయన 2017లో మరణించే వరకూ గాంధీ ఆశయాల కోసం పరితపించారు.

– ఉప్పాల రవీంద్రబాబు,

(కోదండ రామయ్య కుమారుడు) కై కలూరు

పశ్చిమ గడ్డపై మహోద్యమ జ్వాల

అమరుల త్యాగం.. 80 ఏళ్ల స్వేచ్ఛా సంబరం

బ్రిటీష్‌ పాలకులపై గర్జించిన జిల్లా యోధులు

ఉమ్మడి పశ్చిమలో ఉవ్వెత్తున స్వాతంత్య్రోద్యమం

పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement