ఉన్నత లక్ష్యం దిశగా సాగాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత లక్ష్యం దిశగా సాగాలి

Aug 15 2026 12:40 AM | Updated on Aug 15 2026 12:40 AM

ఉన్నత లక్ష్యం దిశగా సాగాలి

ఏలూరు టౌన్‌: ఆధునిక సమాజంలో యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ క్రమశిక్షణతో వాటి సాధనకు శ్రమించాలని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ అన్నారు. ఏలూరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ట్రాఫిక్‌ క్రాస్‌రోడ్స్‌ పార్క్‌లో శుక్రవారం ప్రత్యేక యువజన అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ మాట్లాడుతూ యువత మంచి నిర్ణయాలు తీసుకోవాలనీ, ఉన్నత భవిష్యత్‌కు ఇప్పటి నుంచే బాటలు వేసుకోవాలని సూచించారు. జీవితంలో చోటుచేసుకునే చిన్నపాటి పొరపాట్లు జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు, శక్తియుక్తులను ప్రోత్సహిస్తూ పోలీస్‌, సంక్షేమ శాఖల సమన్వయంతో కృషి చేస్తామన్నారు. యువతలో నైపుణ్యాలను వెలికితీసి ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామని తె లిపారు. ఐటీఐ, మోటారు మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబింగ్‌, డెలివరీ సర్వీసెస్‌ వంటి వివిధ ఉ పాధి రంగాల్లో అవకాశాల కల్పనకు యువతకు అండగా ఉంటామన్నారు. డీసీపీఓ డాక్టర్‌ సూర్యచక్రవేణి, చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణ, టూటౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌, త్రీ టౌన్‌ సీఐ కోటేశ్వరరావు, పెదవేగి సీఐ రాజశేఖర్‌, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

పరేడ్‌ గ్రౌండ్‌ ముస్తాబు

స్వాతంత్య్ర దినోత్సవాలకు ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ ముస్తాబైంది. ఎస్పీ శివకిషోర్‌ పోలీస్‌ కవాతు(పరేడ్‌) రిహార్సల్స్‌ను స్వయంగా పరిశీలించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజర య్యే ప్రముఖులు, ఉన్నతాధికారులు, ప్రజలంతా సౌకర్యవంతంగా వీక్షించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా వాహనాల నిలుపుదలకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలను కేటాయించాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement