ఆదివాణి.. గిరిజన బాణీ | - | Sakshi
Sakshi News home page

ఆదివాణి.. గిరిజన బాణీ

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2026

బుట్టాయగూడెం: గిరిజన భాషలను సంరక్షించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ ఏఐ అనువాద యాప్‌ ‘ఆదివాణీ’ని రూపొందించింది. ఇప్పటికే ఈ యాప్‌లో సంతాలీ(ఒడిశా), భిలీ(మధ్యప్రదేశ్‌), ముండారి(జార్ఖండ్‌), గొండి(ఛత్తీష్‌గఢ్‌) వంటి గిరిజన భాషలు ఉన్నాయి. ప్రస్తుతం కోయ, గారో భాషలను కూడా ఈ యాప్‌లో రూపొందించేందుకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సాయం తీసుకుంటోంది. తెలుగు పదాలను గిరిజన భాషలోకి అనువాదం చేసేందుకు కృషి చేస్తున్నారు. 2021 నాటి జనగణన లెక్క ప్రకారం దేశంలో షెడ్యూల్‌ తెగలకు చెందిన వారు 461 భాషలు మాట్లాడతారు. వీటిలో 81 భాషలు దుస్థితిలో ఉన్నాయని, 42 భాషలు అంతరించి పోయే దశకు చేరుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన శ్రీఆదివాణిశ్రీ యాప్‌ ఆయా గిరిజన భాషల్లోని మాటల్ని హింది, ఇంగ్లీష్‌ భాషల్లోకి అనువదించేందుకు సహాయపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కోయ భాషను కూడా రాష్ట్ర గిరిజన పరిశోధనా సంస్థలు(టీసీఆర్‌), టీఎమ్‌, స్థానిక గిరిజన భాష నిపుణుల సహకారంతో డిజిటలేషన్‌ ప్రక్రియను రూపొందిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆదివాణీ యాప్‌లో గిరిజన భాషను ఏఐ డిజిటలేషన్‌ చేసేందుకు సుమారు 62 వేల తెలుగు పదాలను తీసుకుని వాటిని కోయభాషలోకి అనుభవజ్ఞులైన సుమారు 20 మంది గిరిజన నిపుణులు, ఉపాధ్యాయులు, అనువాదం చేస్తున్నారు. దాంతోపాటు కంప్యూటర్‌లో ఎప్పటికప్పుడు ఆ పదాలను డిజిటైజేషన్‌ చేస్తున్నారు. లిపి లేని గిరిజన భాషను తెలుగు పదాల సాయంతో కోయ భారతి పేరు మీద గిరిజన విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. న్నారు.

ఏఐతో పదిలం కానున్న గిరిజన మాట

ఆదివాసీ గిరిజన భాష సంరక్షణకు బీటా వెర్షన్‌

లిపిలేని కోయ భాషకు 62 వేల తెలుగు పదాలు

కోయ భాషలోకి ఏఐ సాంకేతికతతో అనువదిస్తున్న ఉపాధ్యాయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement