లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద బుధవారం తెల్లవారుజామున లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 8లో u
ఎస్పీ శివకిషోర్
ఏలూరు టౌన్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఏలూరు జిల్లాలో నేరాలను నిరోధించేలా ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్‌స్టేషన్లలో కేసుల నమోదు, చార్జిషీట్లు, దర్యాప్తు, కోర్టులో కేసుల పురోగతి వంటి అనేక అంశాలపై ఆరా తీశారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై నేరాలు జరిగితే వాటిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కీలక కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన విధివిధానాలపై దిశానిర్ధేశం చేశారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని చెప్పారు. సైబర్ నేరాల దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు నైపుణ్యాన్ని పెంచుకోవాలని, కెపాసిటీ బిల్డప్ చేసుకోవాలని చెప్పారు. పోలీసుల పనితీరు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా విధి నిర్వహణ ఉండాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచుతూ.. వాటి నిర్మూలనకు శ్రద్ద వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందుస్తు చర్యలు తీసుకోవటం, ప్రతీ వాహనదారుడు విధిగా హెల్మెట్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. సమీక్షలో అదనపు ఎస్పీ వై.ప్రసాద్‌రావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


