62 వేల పదాలతో రూపొందిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

62 వేల పదాలతో రూపొందిస్తున్నాం

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

62 వేల పదాలతో రూపొందిస్తున్నాం నెల రోజులపాటు పనిచేశాం గిరిజన భాషల సంరక్షణకు ఉపయుక్తం ●

టీసీఆర్‌, టీఎం శాఖల ఆధ్వర్యంలో సుమారు 62 వేల తెలుగు పదాలను తీసుకుని వాటిని కోయభాషలోకి అనువాదం చేస్తున్నాం. సుమారు నెల రోజుల పాటు విశాఖపట్నం, కేఆర్‌పురం ఐటీడీఏలో ఈ ప్రక్రియను పూర్తి చేశాం. కోయ భాషలో రూపొందించిన పదాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నాం. త్వరలోనే ఆదివాణీ యాప్‌లో కోయ భాష మాటలను వినబోతున్నాం.

– నూపా నాగేశ్వరరావు,

గిరిజన భాష రూపకల్పన ఉపాధ్యాయుడు, కేఆర్‌పురం

ఆదివాణీ యాప్‌లో గిరిజన భాష అనువాదాలను అందించనున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ ఏ భాషలో కంటెంట్‌ ఇచ్చినా అది తమ కోరుకున్న గిరిజన భాషలోకి మారుతుంది. ఈ యాప్‌ అందరికీ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో గిరిజన భాషను రూపొందించడానికి మాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నెల రోజులపాటు పనిచేసి ఈ ప్రక్రియను పూర్తి చేశాం.

– మడకం పోశమ్మ ఉపాధ్యాయురాలు,

కె. పండుగూడెం, జీలుగుమిల్లి మండలం

గిరిజన భాషలను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ఆదివాణీ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సంతాలీ, భిలీ, ముండారి, గొండి భాషలు అనువాదానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. త్వరలోనే కోయ భాష కూడా ఈ యాప్‌లో అందుబాటులోకి రానుంది. ఆదివాణీ యాప్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

– కుంజా కన్నపరాజు, కోయ భాషా వలంటీర్‌

గాడిదబోరు, బుట్టాయగూడెం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement