రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

Aug 12 2026 1:10 AM | Updated on Aug 12 2026 1:10 AM

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

దెందులూరు: ప్రణాళికాబద్ధమైన నిరంతర సాధన, శిక్షణతోనే ఉన్నత విజయాలు సాధ్యపడతాయని గోపన్నపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సుభాషిని అన్నారు. అమరావతి కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికవ్వడంతో మంగళవారం ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన 8వ తరగతి విద్యార్థినులు ఎస్‌.సాయి కార్తిక, యు.హిమజ, లాంగ్‌ జంప్‌లో 10వ తరగతి విద్యార్థిని నాగ సింధుజ, వాలీబాల్‌లో 10వ తరగతి విద్యార్థిని ఎస్‌.రాజేశ్వరిలను హెచ్‌ఎం సుభాషిని అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయులు చిటికెన రమేష్‌, ఎండీ అమన్‌ సుల్తానా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement