ఏలూరు టౌన్ : ప్రజలు, మెడికల్ షాపుల యా జమాన్యాలు ఔషధ నిబంధనలు, ప్రిస్కిప్షన్ విధానాలను పాటించాలనీ, పీ5 సూత్రంపై అవగాహన కలిగి ఉండాలని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. ఏలూరు కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, రూరల్ ఏరియా అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరులో అవేర్‌నెస్ మీట్–2026 నిర్వహించారు. రవికృష్ణ మాట్లాడుతూ యజమాని, ఫార్మసిస్ట్, వైద్యుడు, రోగి, ప్రిస్కిప్షన్ ఈ ఐదు అంశాల ప్రాముఖ్యతను మె డికల్ షాపుల యాజమాన్యాలు, ప్రజలు గుర్తించాలని చెప్పారు. త్వరలో డిజిటల్ ట్రాకింగ్ విధానం అమల్లోకి రానుందన్నారు. అనంతరం కెమిస్టులతో ప్రతిజ్ఞ చేయించారు. విజయవాడ డ్రగ్ కంట్రోల్ జేడీ వి.విజయశేఖర్, ఏపీ ఈగల్ ఎస్పీ ఎం.మహేశ్వరరాజు, ఈగల్ సీఐ రవీంద్ర, ఆర్‌ఎస్‌ఐ ఉదయ్‌భాస్కర్, డీసీఏ అధికారులు, ఈగల్ సిబ్బంది, కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుట్టా రవిచంద్ర, సయ్యద్ బాజిద్, ఎ.చంద్రమోహన్, పి.వాసుదేవరావు పాల్గొన్నారు.
చింతలపూడి: డీఎస్సీ అక్రమాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు సోమవారం చింతలపూడి నియోజకవర్గంలో నిర్వహించాల్సిన భారీ ర్యాలీ, ఇతర కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు, చింతలపూడి ఏఎంసీ మాజీ చైర్‌పర్సన్ జగ్గవరపు జానకిరెడ్డి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు పేర్కొన్నారు. జానకిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ, ఆమె కుటుంబ సభ్యుల కు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో యథావిధిగా నిరసనలు నిర్వహిస్తామన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆదివారం నిర్వహించిన టెట్ పరీక్షలకు 677 మంది హాజరయ్యారు. ఉదయం 384 మందికి గాను 338 మంది, మధ్యాహ్నం 384 మందికి గాను 339 మంది హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పరీక్షా కేంద్రాలను సందర్శించింది. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో సోమవారం సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌ను రద్దు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మిగిలిన మండల, డివిజన్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు.
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): బ్యాంకు వేలంలో భూమిని కొనుగోలు చేసి మోసపోయానంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కోస్టల్ ఏరియా బ్యాంక్ మాజీ మేనేజర్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నా యి.. జనవరిలో జంగారెడ్డిగూడెం కోస్టల్ ఏరి యా బ్యాంక్ ఆధ్వర్యంలో పట్టణంలోని 108 గజాల స్థలానికి వేలం నిర్వహించగా రాజు జయపండే రూ.17.66 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం ఆ స్థలాన్ని శుభ్రం చేస్తుండగా ఈ స్థలం తమదంటూ కొందరు వచ్చి అడ్డుకున్నారు. దీనిపై జయపండే బ్యాంకు అధికారులను నిలదీయగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యా దు మేరకు కోస్టల్ ఏరియా బ్యాంక్ మాజీ మేనేజర్ ఆంజనేయులు, అ సిస్టెంట్ మేనేజర్ కిషో ర్, సిబ్బంది కృష్ణారావు, హరిప్రియలపై జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కలిదిండి(కై కలూరు) : ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కలిదిండిలో పర్యటించనున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పర్యటన వివరాలు వెల్లడించారు. మీ భూమి–మీ హక్కు పట్టాల పంపిణీలో భాగంగా ఇక్కడకు రానున్నారని, ఉదయం 10.45 గంటలకు ఇక్కడకు చేరుకుంటారన్నారు. హెలీప్యాడ్, సభ, సమావేశ స్థలాలను ఆదివారం పరిశీలించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వీ, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, జేసీ, ఆర్డీవో, సబ్ కలెక్టర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


