కై కలూరు: విద్యార్థుల జీవితాలను పైరవీల ద్వారా చెలగాటమాడిన డీఎస్సీ–2025పై సీబీఐతో పూర్తిస్థాయి విచారణ చేయించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) డిమాండ్ చేశారు. కలిదిండి మండల పార్టీ అధ్యక్షుడు తిరుమాని రమేష్ ఆధ్యక్షతన కై కలూరు పార్టీ కార్యాలయం వద్ద చివరి రోజు ఆదివారం రిలే దీక్షలు జరిగాయి. ముఖ్య అతిథిగా డీఎన్నార్ మాట్లాడుతూ నాలుగు రోజుల దీక్షలకు పెద్ద ఎత్తున నాయకులు, విద్యార్థులు హాజరయ్యారన్నారు. అన్ని అర్హతలు కలిగిన విద్యార్థులకు అన్యా యం జరిగిందని పార్టీ రాష్ట్ర మహిళా సెక్రటరీ కూసంపూడి కనకదుర్గారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని పోసిన చెంచు రామారావు డిమాండ్ చేశారు. యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు వెంకట కిషోర్ మణికంఠ వర్మ (కిట్టు), జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు దుగ్గిరాల నాగు మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. వడుపు రామారావు, పండు ఆనంద రవిరాజు, చాన్‌బాషా, కందుల వెంకటేశ్వరరావు మాట్లాడారు. సాయంత్రం దీక్ష చేసిన వారికి నిమ్మరసం అందించి డీఎన్నార్, ఆయన కుమారుడు శ్యామ్ విరమింపజేశారు. ఎంపీపీలు చందన ఉమామహేశ్వరరావు, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, నాయకులు కొల్లాటి సత్యనారాయణ, ముండ్రు చార్లీస్, చిట్టూరి బుజ్జి, నీలపాల వెంకటేశ్వరరావు, ఆకుల మురళీకృష్ణ, దాసి ఏసుబాబు, బలే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నాలుగు మండలాల నుంచి వచ్చిన నాయకులు దీక్ష శిబిరం వద్ద సంఘీభావం తెలిపారు. సోమవారం కై కలూరు రైల్వేస్టేషన్ పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నామని నాయకులు తెలిపారు.


