మన్య ప్రాంతం బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో బోనాల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. బండర్లగూడెం నుంచి భక్తులు బోనాలు ఎత్తుకుని పోతురాజు విన్యాసాలు, శివ సత్తుల పూనకాలతో ఊరేగింపు నిర్వహించారు. కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని ఐదేళ్లుగా బోనాలు సమర్పిస్తున్నట్టు భక్తులు తెలిపారు. అలాగే ఆలయంలో అమ్మవారు శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. దాసరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అలంకరణ జరిగింది.
– బుట్టాయగూడెం


