ఆక్వాకు పంట విరామం | - | Sakshi
Sakshi News home page

ఆక్వాకు పంట విరామం

Aug 10 2026 12:46 AM | Updated on Aug 10 2026 12:46 AM

ఆక్వాకు పంట విరామం

ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షల ఎకరాలు, రొయ్యలు 1.10 లక్షల ఎకరాలు మొత్తంగా 2.90 లక్షల్లో ఆక్వాసాగు ఉంది. మొత్తంగా 65 వేల మంది రైతులు ఆక్వాపై ఆధారపడి జీవిస్తున్నారు. మేత తయారు చేసే కంపెనీలు టన్నుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు (వనామీ రొయ్యల మేత కిలోకు రూ.8, టైగర్‌ రొయ్యల మేత కిలోకు రూ.10 చొప్పున) ధరలను పెంచేశాయి. మేత కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమంగా ధరలను పెంచుతున్నాయని రైతులు పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మేత బస్తాలను రోడ్లపై తగలబెట్టారు. రైతులతో చర్చించకుండా ధరలు ఎలా పెంచుతారని నిలదీశారు. ఆందోళనలు తీవ్రంగా కావడంతో మేత ధరల తగ్గింపు విషయాన్ని సీఎం చెప్పింది ఒకటైతే క్షేత్రస్థాయిలో ధరల తగ్గింపు లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement