● గిట్టుబాటు ధర దక్కక.. అప్పులు తీర్చే మార్గం కనిపించక పొగాకు రైతు మృతి
● మనోవేదనతో గుండెపోటుకు గురై మరణించాడన్న భార్య, కుటుంబ సభ్యులు
బుట్టాయగూడెం: పొగాకు పంటకు గిట్టుబాటు ధర దక్కలేదన్న దిగులు.. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడం ఆ రైతును తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. వేలం కేంద్రానికి 8 బేళ్లు తరలించగా.. రెండు బేళ్లను కొనుగోలు చేసిన అధికారులు 6 బేళ్లను వెనక్కి పంపించారు. చివరకు బంటా కూలీ చెల్లించేందుకు కూడా డబ్బుల్లేకపోవడంతో ఆ రైతు కుంగిపోయాడు. చివరకు గుండె పగిలి మరణించాడు. మండలంలోని ముప్పినవారిగూడెంకు చెందిన పొగాకు రైతు పాలా వెంకటేశ్వరరావు (70) గుండెపోటుకు గురై రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం సాయంత్రం మృత్యువాత పడిన ఘటన వి దితమే. గురువారం అతడి భార్య సీతారత్నం, కు మారుడు శ్రీనివాసరావు, కుమార్తెలు వెంకటరమణ, సుజాత మీడియాతో మాట్లాడారు.
‘మాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదయ్యా’
రైతు భార్య సీతారత్నం మాట్లాడుతూ.. ‘నా భర్త ఈ ఏడాది 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు పండించారు. సీజన్ ప్రారంభంలోనే వేసిన పంట పాడైపోవడంతో దానిని దున్ని మళ్లీ పంట వేశాం. సాగు కోసం బ్యాంకు నుంచి రూ.12 లక్షల రుణం తీసుకున్నాం. ప్రైవేట్ అప్పులు మరో రూ.10 లక్షలు పంట కోసం వెచ్చించాం. పాడైన పంటను దున్ని మళ్లీ పంట వేయడం వల్ల అదనంగా అప్పుల భారం పడింది. పొగాకు కొనుగోళ్ల ప్రారంభం నుంచీ పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మా ఆయన దిగులుపడ్డారు. ఇటీవల జంగారెడ్డిగూడెం వేలం కేంద్రానికి 8 బేళ్లు అమ్మకానికి తీసుకెళ్లగా.. కేవలం 2 బేళ్లు మాత్రమే కొన్నారు. మిగిలిన 6 బేళ్లు వెనక్కి పంపించారు. పొ గాకు పనులు వేసిన బంటాకు సుమారు రూ.1.50 లక్షల వరకు బకాయి పడ్డాం. ఆ డబ్బుల కోసం కూలీలు మా ఇంటికొచ్చి గొడవ చేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై నా భర్త ఇబ్బంది పడే వారు. అప్పుల బాధ ఎలాగైనా తీర్చుకోవచ్చు ఆందోళన చెందవద్దని చెబుతూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదయ్యా’ అంటూ కన్నీటి పర్యంతమైంది.
‘ఈ అన్యాయం మరే రైతు కుటుంబానికి జరగకూడదు’
రైతు వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘వ్యవసాయం అంటే మా నాన్నకు ఎంతో ఇష్టం. పొగాకు ధరలు పెరగకపోవడంతో అప్పులవాళ్లు ఇబ్బంది పెడుతున్నారని డబ్బు స ర్దాలని నాన్న అడిగారు. ఆందోళన చెందొద్దని.. తా ను ఏదోలా డబ్బులు సమకూరుస్తానని చెప్పాను. ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురై మరణించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో కిలో పొగాకు ధర సుమారు రూ.450 చొప్పున వచ్చింది. రైతు కుటుంబాలు ఎంతో ఆనందించాయి. ఇప్పుడు హైగ్రేడ్ పొ గాకు కిలో రూ.265, లోగ్రేడ్ పొగాకు కిలో రూ.175 పలుకుతోంది. దీంతో గిట్టుబాటు ధరలేక ఇళ్ల వద్దే పొగాకు బేళ్లు నిల్వ ఉంచే పరిస్థితి. ఇలాంటి అ న్యాయం మరే రైతు కుటుంబానికి జరగకూడదు.’ అని అన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులను పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గురువారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం రైతుల కష్టాలను పట్టించుకోకపోవడంతో రై తు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వ స్తున్నాయన్నారు. ప్రభుత్వం పొగాకు రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బాధిత రైతు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఆరేటి సత్యనారాయణ, జెడ్పీటీసీ మొడియం రామతు ల సి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్ర సాద్, మాజీ సర్పంచ్ తెల్లం వెంకటలక్ష్మి, నాయకు లు కుక్కల రాంపండు, పంపన కృష్ణ, పంపన నాగబాబు, మేకరబోయిన శ్రీను, జిత్తుక సురేష్ ఉన్నారు.


