నేడు మెగా పీటీఎం | - | Sakshi
Sakshi News home page

నేడు మెగా పీటీఎం

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

నవజాత శిశువు మృతి

నవజాత శిశువు మృతి
ఏలూరు జీజీహెచ్‌లో నవజాత శిశువు మృతి చెందడంతో బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. 8లో u

కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 1772 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాలు పెంపుదల, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పాఠశాల–కుటుంబ సంబంధాలను పటిష్టపరచడం మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌ ప్రధాన ఉద్దేశమన్నారు.

నిర్వాసితులను తరలించాలి

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితుల కాలనీలను డిసెంబర్‌లోపు పూర్తిచేసి, నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి పోలవరం ప్రాజెక్ట్‌ పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణ పనులపై అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులతో పాటు రోడ్లు, డ్రైనేజీ, అంగన్‌వాడీ, పాఠశాలలు, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులను కల్పి ంచాలన్నారు. భూసేకరణలో అవకతవకలకు పాల్పడినా, కాలనీల నిర్మాణాల విషయంలో అలసత్వం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌, ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి రాములు నా యక్‌, ఎస్డీసీ దేవకీదేవి, ఎస్‌ఈలు జెడ్‌.రమేష్‌, విజయరత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement