టి.నరసాపురం: మక్కినవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అవకతవకలు జరిగాయంటూ స్థానిక రైతులు సిరిమళ్ల జనార్దనరావు, ఆచంట అనిల్‌కుమార్, సిరిమళ్ల వెంకటేశ్వరరావులు ఇటీవల ఏలూరులో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన చింతలపూడి కో–ఆపరేటివ్ సహాయ రిజిస్ట్రార్ ఏకేఎస్‌ఎస్ మూర్తి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ నజీమ్‌లు శుక్రవారం సొసైటీలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఈ సందర్భంగా విచారణ అధికారులు తెలిపారు.


