తొలి ఏకాదశికి ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

తొలి ఏకాదశికి ముస్తాబు

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ తొలి ఏకాదశికి ముస్తాబు రేపు రాష్ట్ర రోయింగ్‌ పోటీలు

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌ను రాష్ట్ర ఎలెక్టోరల్‌ అధికారి కార్యాలయ డిప్యూటీ సీఈఓ ఎస్‌.ఆంజనేయులుతో కలిసి కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు.

ద్వారకాతిరుమల: ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. శనివారం తొలి ఏకాదశి కావడంతో ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శుక్రవారం దేవస్థానం సిబ్బంది సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారని ఆలయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి ఏకాదశి రోజున అన్నం, మాంసాహారం తీసుకోకూడదని శ్రీవారి దేవస్థానం ఆగమ పండితులు సుదర్శనం శ్రీనివాసాచార్యులు తెలిపారు. తులసి ఆకులు కోయడం, జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం, గొడవలు, దుర్భాషలు, పగలు నిద్రపోవడం, ఇతరులను అవమానించడం వంటి పనులకు దూరంగా ఉండాలన్నారు. వేకువజామున స్నానం చేసి శ్రీమహావిష్ణువును తులసీ దళాలతో పూజించాలని, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని జపిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలన్నారు. ఉపవాసం పాటించి, దానధర్మాలు చేసి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని చెప్పారు.

లబ్బీపేట (విజయవాడతూర్పు): రోయింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 26న జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర రోయింగ్‌ చాంపియన్‌ షిప్‌–2026 పోటీలు నిర్వహించనున్నట్టు ఏపీ స్కల్లింగ్‌ అండ్‌ రోయింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ తరుణ్‌ కాకాని తెలిపారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ పోటీల్లో 500 మీటర్ల దూరంలో సబ్‌ జూనియర్‌, జూనియర్‌ సీనియర్‌ విభాగాల్లో బాలురు, బాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement