ముదినేపల్లి (కై కలూరు): ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాట పటిమకు ఆకర్షితులై పలువురు పార్టీలోకి చేరుతున్నారని జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. ముదినేపల్లి మండలం ప్రొద్దువాక గ్రామంలో టీడీపీకి చెందిన దొడ్డాకుల సాయి శివకుమార్, బోయిన వెంకట నరసింహ, కుందేటి వీరాంజనేయులు శుక్రవారం కై కలూరులో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. డీఎన్నార్ వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రామరాజు, జిల్లా పంచా యతీరాజ్ విభాగ కార్యదర్శి బొబ్బిలి రత్తయ్యనాయుడు, సిరిపురపు సత్యనారాయణ, కర్రే సోమశేఖరరావు పాల్గొన్నారు.
భీమవరం: అమరావతి చాంపియన్‌షిప్ నియోజకవర్గ సెలెక్షన్ ట్రెయిల్స్‌ను శనివారం నుంచి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాధికారి శుక్రవారం ప్రకటన లో తెలిపారు. అండర్–17, అండర్–23 విభాగాల్లో 12 ఆటల్లో సెలెక్షన్స్ ఉంటాయన్నారు.


