న్యూస్‌రీల్
నోటీసులిస్తే నాకే వార్నింగ్‌లు
రూ.50 లక్షలకు పెంచినా మారని పరిస్థితి
శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026
ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ ఆలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారిందనే ఆరోపణలకు ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ట్రస్టు బోర్డు సమావేశం బలంచేకూర్చింది. నెలకు రూ.40 లక్షలకు పైగా వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిశుభ్రత కనిపించడం లేదని బోర్డు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అధికారులను నిలదీశారు. చివరకు 15 రోజుల్లోగా పరిస్థితి మెరుగుపడకపోతే కాంట్రాక్టు రద్దుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని సభ్యులు అల్టిమేటం జారీ చేశారు. సీఎం బంధువైన కాంట్రాక్టర్ తీరుపై కూటమి సభ్యులే గళమెత్తడం క్షేత్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.
ట్రస్టు బోర్డు సమావేశంలో తీవ్ర చర్చ
కొండపై ఉన్న ద్వారకా అతిథి గృహంలో గురువా రం జరిగిన ట్రస్టు బోర్డు సమావేశంలో దాదాపు 40 నిమిషాల పాటు పారిశుద్ధ్య నిర్వహణపైనే సుదీర్ఘంగా చర్చ సాగింది. పర్వదినాలు, వివాహ శుభకార్యాలు ఎక్కువగా జరిగే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని సభ్యులు మండిపడ్డారు.
సిబ్బంది గైర్హాజరు
గతంతో పోలిస్తే పారిశుద్ధ్య కాంట్రాక్టులో కార్మికుల సంఖ్య పెరిగినా, క్షేత్రస్థాయిలో కొద్దిమంది మా త్రమే కనిపిస్తున్నారని ద్వారకాతిరుమల మండలానికి చెందిన ఇద్దరు సభ్యులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 200 మంది విధులు నిర్వహించాల్సి ఉండగా, తక్కువ మందితోనే మమ అనిపిస్తున్నారని ఆరోపించారు.
మేనేజర్‌పై ఆగ్రహం..
15 రోజుల అల్టిమేటం
పారిశుద్ధ్య కాంట్రాక్ట్ మేనేజర్‌పై కూడా సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా కార్మికులతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడని, అధికారులను ఏమాత్రం లెక్కచేయడం లేదని వచ్చిన ఫి ర్యాదులపై నిలదీశారు. దీనికి ఆయన నుంచి ఎ లాంటి సమాధానం రాకపోవడంతో సభ్యులు మ రింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ వెనుక ఎవరున్నా ఇకపై సహించేది లేదు. 15 రోజుల్లోగా ప రిస్థితి మెరుగుపడకపోతే కాంట్రాక్టును రద్దు చేస్తూ తీర్మానం చేసి, ప్రభుత్వానికి నివేదిస్తాం.’అంటూ ట్రస్టు బోర్డు సభ్యులు హెచ్చరించారు.
అధికారి సంచలన వ్యాఖ్యలు
సమావేశంలో ఓ పర్యవేక్షణాధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తన 40 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య లోపాలపై కాంట్రాక్టర్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేస్తే, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి తిరుగు ప్రయాణంలో తనకే హెచ్చరికలు వచ్చాయని, చర్యలు తీసుకుంటామని భయపెట్టారని సభ్యుల ఎదుట వెల్లడించడంతో సమావేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఆలయాల ఆదాయ, వ్యయాలను బట్టి ఆయా దేవస్థానాల అధికారులే టెండర్లు ఖరారు చేసేవారు. అప్పట్లో ద్వారకాతిరుమల పారిశుద్ధ్య కాంట్రాక్టు విలువ నెలకు రూ.18.28 లక్షలుగా ఉండేది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పారిశుద్ధ్య సేవలను మెరుగుపరుస్తామనే కారణంతో రాష్ట్ర దేవదాయ శాఖ కార్యాలయం ద్వారానే అన్ని ప్రముఖ ఆలయాల టెండర్లను నిర్వహించింది. ఈ క్రమంలో 2015–2019 మధ్య (టీడీపీ హయాంలో) పనిచేసిన కాంట్రాక్టర్ భాస్కరనాయుడికే మళ్లీ టెండర్ లభించింది. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టు మొ త్తాన్ని రూ.50 లక్షలకు పెంచినా పారిశుద్ధ్యంలో మార్పు రాకపోవడం, పైగా సీఎం చంద్రబాబుకు బంధువైన కాంట్రాక్టర్ తీరుపై కూటమి సభ్యులే గళమెత్తడం ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీవారి క్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ట్రస్టుబోర్డు సభ్యుల ఆగ్రహం
సమావేశంలో 40 నిమిషాలపాటు వాడీవేడిగా చర్చ
కాంట్రాక్టర్‌కు 15 రోజుల గడువిస్తూ అల్టిమేటం
తీరు మారకుంటే కాంట్రాక్ట్ రద్దుకు తీర్మానం చేస్తామని హెచ్చరిక
సీఎం బంధువు (కాంట్రాక్టర్) నిర్వాకంపై కూటమి సభ్యులే గళం
ఏఐ సృష్టించిన చిత్రం


