ప్రభుత్వ ఐటీఐలో ఆన్‌లైన్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఐటీఐలో ఆన్‌లైన్‌ అడ్మిషన్లు

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

ప్రభుత్వ ఐటీఐలో ఆన్‌లైన్‌ అడ్మిషన్లు గ్రీవెన్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా బాచి ఎస్సీ యువతకు ఉచిత శిక్షణ

నూజివీడు: నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల కోసం రెండో విడత కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రధాన అధికారి పి.రజిత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 3న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు కాపీని ప్రింట్‌ తీసుకుని ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఆగస్టు 4లోపు వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. 6న ఐటీఐ కళాశాలలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని పేర్కొన్నారు.

ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఏలూరుకి చెందిన భాస్కర్ల ఆర్‌ఎన్‌ శంకర్‌ (బాచి)ను వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎస్సీ యువతకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు షెడ్యూల్‌ కులాల సహకార సంఘం కార్యనిర్వాహక ఇంజనీర్‌ ఎం.ముక్కంటి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కిసాన్‌ డ్రోన్‌ ఆపరేటర్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ టెక్నిషియన్‌, బ్యూటీ థెరపిస్ట్‌, ప్లంబర్‌–జనరల్‌ కోర్సులకు టెన్త్‌ పాస్‌, డ్రోన్‌ సర్వీస్‌ టెక్నీషియన్‌, సోలార్‌ పీవీ ఇన్‌స్టాలర్‌ కోర్సులకు ఇంటర్మీడియట్‌ పాస్‌ కావాలన్నారు. అభ్యర్థుల వయసు 21–45 ఏళ్ల మధ్య ఉండాలని, శిక్షణ వ్యవధి 90 రోజులు ఉంటుందని, ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఎ.రవికుమార్‌ సెల్‌: 9393527666, జూనియర్‌ అసిస్టెంట్‌ ఎం.శ్రీనివాసరావు 98498 42059, సీనియర్‌ అసిస్టెంట్‌ ఎం.సుషుమాదేవి 9177721350 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement