న్యూస్‌రీల్
రెండేళ్లుగా ఫలసాయం కోయనీయకుండా..
చింతమనేనికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: అబ్బయ్యచౌదరి
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
కామవరపుకోట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను లక్ష్యంగా చేసుకుని మట్టిని తోడేస్తోంది. 8లో u
శురకవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షిప్రతినిధి, ఏలూరు: దెందులూరులో అధికార పార్టీ దౌర్జన్యకాండ తారాస్థాయికి చేరింది. సామాన్యుడిని మొదలు ప్రతిపక్ష పార్టీ ప్రధాన నేతల వరకూ అందరినీ లక్ష్యంగా చేసుకుని ఆస్తినష్టాలకు తెగబడే కొత్త సంస్కృతికి తెరలేచింది. సాక్షాత్తూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ప్రజాప్రతినిధి కొఠారు అబ్బయ్యచౌదరిని లక్ష్యంగా చేసుకుని రెండేళ్ల నుంచి ప్రత్యక్ష వేధింపులకు విడతల వారీగా దిగుతుండటం నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది.
రెండేళ్లుగా అబ్బయ్యచౌదరి కుటుంబానికి చెందిన పొలంలో ఫలసాయం కోయకుండా దాడి, దౌర్జన్యం, తప్పుడు కేసులతో అధికార పార్టీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు.
కక్ష సాధింపు ధోరణితో..
దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో పోలీసుల ద్వారా అడ్డగోలు చర్యలకు దిగుతూ హడావుడి కొనసాగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అబ్బయ్యచౌదరి లక్ష్యంగా దాడులు, ధ్వంస రచనకు సన్నద్ధమైతే ప్రతిపక్ష పార్టీ నేతలు బలంగా తిప్పుకొట్టారు. కొల్లేరు రైతులకు లీజు డబ్బులు ఇవ్వాలనే సాకుతో చింతమనేని నియోజకవర్గంలో కొత్త వివాదానికి తెరదీశారు. కౌంటింగ్ మరుసటి రోజు నుంచే అబ్బయ్యచౌదరి ఇంటి వద్ద డప్పు కొట్టించడం, వంటావార్పు చేయించడం, కొల్లేరు ప్రాంతానికి చెందిన వారనే ముసుగులో టీడీపీ కార్యకర్తలతో హడావుడి కొన్ని నెలల పాటు కొనసాగించారు. అబ్బయ్యచౌదరి తానేమీ ఎవరికీ బాకీ లేనని, డబ్బులు ఇవ్వాల్సిందేమి లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పడంతో వివాదం సర్దుమణిగింది.
అబ్బయ్యచౌదరి, సోదరిమణులకు స్వగ్రామమైన కొండలరావుపాలెంలో 70 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. దానిలో ఆయిల్‌పామ్, కోకో, కొబ్బరి సాగులో ఉంది. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి ఇక్కడ ఫలసాయం కోయనివ్వకుండా ఎమ్మెల్యే వర్గీయులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని గందరగోళం సృష్టిస్తున్నారు. కొద్ది నెలల క్రితం పంట కోసే సమయంలో దాడులు, దౌర్జన్యాలకు తెగబడి పొలంలో చెట్లు నరకడంతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే ఎదురు కేసు నమోదు చేయించారు. ఆ తరువాత మళ్లీ ఇదే తరహాలో హడావుడి జరగడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేసి టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడటం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా పొలంలో పని చేయించుకోవడానికి కూలీలను మాట్లాడుకుంటే టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేసి రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో రెండేళ్లుగా ఫలసాయం చెట్లపైనే కుళ్లిపోవడంతో 400 లకుపైగా ఆయిల్‌పామ్ మొక్కలు చనిపోవడం, కొబ్బరి, మరికొన్ని మొక్కలు మృత్యువాత పడటంతో రూ.2.20 కోట్ల మేర ఫలసాయం నష్టం జరిగింది. ఈ పరిణామాల క్రమంలో బుధవారం అబ్బయ్యచౌదరి పొలంలో ఉండి పనులు చేయిస్తుండగా మళ్లీ పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
మాజీ ఎమ్మెల్యేకు తప్పని వేధింపులు
అబ్బయ్యచౌదరి పొలంలో పంట కోయనీయకుండా అడ్డుకునే యత్నం
రెండేళ్లుగా ఇవే వేధింపులు కొనసాగిస్తున్న చింతమనేని
70 ఎకరాల్లో కుళ్లిపోతున్న ఫలసాయం
దాదాపు రూ.2.20 కోట్ల నష్టం
ఆయిల్‌పామ్, కొబ్బరి మొక్కల మృత్యువాత
కోతకు వచ్చే కూలీలపై టీడీపీ నేతల బెదిరింపులు
చింతమనేని బెదిరింపులకు భయపడేది లేదు: అబ్బయ్యచౌదరి
పొలంలో పనులు చేయడానికి వచ్చే కూలీల ఇళ్లకు ఎమ్మెల్యే చింతమనేని వెళ్లి పనులకు వెళ్లవద్దని అడ్డగించడం సిగ్గుమాలిన చర్య అని అబ్బయ్యచౌదరి ధ్వజమెత్తారు. తనలాంటి వారికి కూడా కొత్త రాజకీయాలు నేర్పిస్తున్నారని, కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆయన హెచ్చరించారు.


