ఆస్తి పన్ను డిమాండ్, వసూళ్ల శాతం
నూజివీడు: ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్ల పర్వం నత్తనడకన సాగుతోంది. పురపాలక సంఘాలకు, నగరపాలక సంస్థలకు, నగర పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్ను. పారిశుద్ధ్యం, వీధిలైట్లు, డ్రైనేజీ వ్యవస్థలను సక్రమంగా నిర్వహించాలంటే సాధారణ నిధులే ఆధారం. ఎంతో కీలకమైన పన్ను వసూళ్లలో ఏమాత్రం అశ్రద్ధ చూపించినా నిధుల లేమితో పారిశుద్ధ్యం, వీధిలైట్లు, డ్రైనేజీ వ్యవస్థల పరిస్థితి దారుణంగా తయారై పట్టణ, నగరాలలోని ప్రజలకు కష్టాలు తప్పవు. రెండు జిల్లాల్లోని పురపాలక సంఘాలలో ఆస్తి పన్ను వసూళ్లను గమనిస్తే పని తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. మున్సిపల్ మంత్రితో పాటు మున్సిపల్ ఉన్నతాధికారులు పదే పదే వీడియో కాన్ఫరెన్స్‌లలో మొత్తుకుంటున్నా ఆస్తిపన్ను వసూళ్లు ఊపందుకోవడం లేదు. పట్టణాలు, నగరాలలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నా, వీధిలైట్లు వెలిగించాలన్నా, పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వర్తించాలన్నా పన్నులు సక్రమంగా వసూలైతేనే సాధ్యం. సాధారణ నిధులు పుష్కలంగా లేకపోతే ప్రతి చిన్న పనికి మున్సిపాలిటీలు ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్‌లపై ఆధారపడాల్సి వస్తుంది. పురపాలక సంఘాలకై తే పన్నుల వసూలు ద్వారా వచ్చే నిధులే ఆధారం. ఇంత కీలకమైన పన్ను వసూళ్ల విషయంలో పురపాలక, నగరపాలక సంస్థల సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీలో ప్లానింగ్ సెక్రటరీలు ఉన్నప్పటికీ పన్నుల వసూళ్లు ఊపందుకోలేదు. 2025–26 ఆర్థిక సంవత్సరం మరో 25 రోజుల్లో ముగియనుండగా రెండు జిల్లాల్లోని ఏ మున్సిపాలిటీలో కూడా ఆస్తి పన్ను వసూలు 60 శాతం దాటలేదు. సమయం దగ్గర పడుతున్నా.. వసూలు చేయకుండా ఆర్థిక సంవత్సరం మార్చిలో హడావుడి చేయడం ఏటా ఆనవాయితీగా మారింది.
ప్రథమ స్థానంలో తణుకు మున్సిపాలిటీ
2025–26 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వసూలులో రెండు జిల్లాల్లో కలిపి తణుకు మున్సిపాలిటీ 65 శాతంతో ప్రథమస్థానంలో ఉంది. ఈ మున్సిపాలిటీకి డిమాండ్ రూ.16.40 ండగా ఇంతవరకూ రూ.10.63 వసూలు చేశారు. చింతలపూడి నగర పంచాయతీ ఆఖరి స్థానంలో ఉంది. ఇక్కడ డిమాండ్ రూ.2.70 కాగా ఇంతవరకు రూ.1.20 వసూలై 44 శాతంతో ఉంది.
మున్సిపాలిటీ డిమాండ్ వసూళ్లు శాతం
(రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
ఏలూరు 50.11 24.24 48
నూజివీడు 7.51 4.31 57
జంగారెడ్డిగూడెం 9.02 5.17 57
చింతలపూడి 2.70 1.20 44
భీమవరం 26.55 15.92 60
నర్సాపురం 8.43 4.34 51
పాలకొల్లు 9.22 5.46 59
ఆకివీడు 3.57 1.86 52
తాడేపల్లిగూడెం 17.28 10.26 59
తణుకు 16.40 10.63 65
గుదిబండగా మారుతున్న పాత బకాయిలు


