ఉండి: ఈ నెల 3, 4 తేదీల్లో సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. మండలంలో ప్రధానమైన బొండాడ మేజర్ డ్రెయిన్‌తో పాటు మీడియం, మైనర్ డ్రెయిన్‌లు గుర్రపు డెక్క, తూడు, చెత్తచెదారంతో నిండిపోయాయి. దీంతో మండలంలోని ఆరేడు, పాందువ్వ, కోలమూరు, యండగండి, చిలుకూరు, ఎన్నార్పీ అగ్రహారం, ఉండి, వెలివర్రు, మహదేవపట్నం తదితర గ్రామాల్లోని వరిపంటతో పాటు పాలకోడేరు, ఆకివీడు మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా పంట ముంపునకు గురికావడంతో రైతులు లబోదిబోమన్నారు. సాక్షిలో వచ్చిన కథనాలకు అధికారులు బుధవారం స్పందించారు. పొక్లెయిన్ సాయంతో అక్విడెక్టు వద్ద మేటలు వేసిన డెక్క తూడును తొలగించి ట్రాక్టర్‌ల సహాయంతో ఇతర ప్రాంతాలకు దానిని తరలిస్తున్నారు.


