స్కూల్‌ స్వీపర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ స్వీపర్ల నిరసన

Jan 6 2026 7:30 AM | Updated on Jan 6 2026 7:30 AM

స్కూల

స్కూల్‌ స్వీపర్ల నిరసన

స్కూల్‌ స్వీపర్ల నిరసన రేపటి నుంచి కోరుకొల్లు గేటు మూసివేత ముగ్గురు కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు సమస్యల పరిష్కారమే ధ్యేయం వెలి బాధితుల కోసం ముమ్మర గాలింపు

ఏలూరు (టూటౌన్‌): మున్సిపల్‌ స్కూల్‌ స్వీప ర్లు, శానిటేషన్‌ వర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలంటూ యూనియన్‌ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌ లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు కె.విజయలక్ష్మి మాట్లాడు తూ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 180 మంది స్కూల్‌ స్వీపర్లు, శానిటేషన్‌ వర్కర్లు పనిచేస్తున్నారన్నారు. స్వీపర్లకు రూ.4 వేలు, శానిటేషన్‌ వర్కర్లకు రూ.6 వేలు ఇచ్చి గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారన్నారు. ట్రిబ్యునల్‌ తీర్పు, కౌన్సిల్‌ తీర్మానాలను అనుసరించి కార్మి కులకు ఫుల్‌ టైమ్‌ వేతనాలు ఇప్పించాలని డి మాండ్‌ చేశారు. లేకుంటే ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. సీహెచ్‌ లక్ష్మి, ఎస్‌కే యాస్మిన్‌, టి.నాగమణి, ఎల్‌.రమణ, పి.సారమ్మ, వై.భవానీ పాల్గొన్నారు.

కై కలూరు: రైలు పట్టాలు మరమ్మతుల నిమిత్తం మండవల్లి–కై కలూరు రైలు మార్గంలో లెవిల్‌ క్రాసింగ్‌ నంబరు–81 (కోరుకొల్లు గేట్‌)ను వారం రోజులపాటు మూసివేస్తున్నట్టు కై క లూరు రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ ఎండీ అబ్దుల్‌ రహ్మాన్‌ సోమవారం తెలిపారు. ఈనెల 7న ఉదయం 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటలకు వరకు గేటు మూసివేస్తామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు.

దెందులూరు: గోపన్నపాలెం గ్రామ పంచాయతీలో విధి నిర్వహణలో అలసత్వం, ఇతర కారణాల నేపథ్యంలో గ్రేడ్‌–3 సెక్రటరీ స్పానిష్‌బా బు, గ్రేడ్‌–5 సెక్రటరీ విజయకుమార్‌కు జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ షోకా జ్‌ నోటీసులు జారీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి సోమవారం ఆకస్మికంగా పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభను సందర్శించారు. అలాగే పోతునూరు పంచాయతీలో ప్రభుత్వ స్థలంలో కట్టిన భవనంపై దళిత సర్పంచ్‌ అనే సాకుతో తన పేరు ముద్రించలేదని పోతునూరు సర్పంచ్‌ బోదుల స్వరూప్‌ కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ కార్యదర్శికి డిప్యూటీ ఎంపీడీఓ ఆశీర్వాదం షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. ఒకే మండలంలో ముగ్గురు గ్రామ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఏలూరు (టూటౌన్‌): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనతా వారధిగా వచ్చిన ట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న అన్నారు. బీజేపీ రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూ రు కలెక్టరేట్‌ వద్ద జనతా వారధి నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషిచేస్తుందని నాయకులు అన్నారు. జిల్లా అధ్యక్షు డు విక్రమ్‌ కిషోర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపాటి సత్యనారాయణ పాల్గొన్నారు.

ముసునూరు: రూ.లక్ష జరిమానా, కుల వెలివేత బాధిత కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం తీవ్ర గాలింపు నిర్వహిస్తున్నట్టు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. మండలంలోని లోపూడిలో కుల పెద్దల తీర్పుతో బెంబేలెత్తి కుటుంబసభ్యులంతా మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పా ల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా ప్రకటించి, అదృశ్యమైన బోట్ల కనకారావు కుటుంబం ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసు బృందాలు ఏలూరు, చింతలపూడి, నూజివీడు, హను మాన్‌ జంక్షన్‌, విసన్నపేట పరిసర ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలింపు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకూ ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. కుల పెద్దలు పోలీసుల అదుపులో ఉన్నారు.

స్కూల్‌ స్వీపర్ల నిరసన 1
1/2

స్కూల్‌ స్వీపర్ల నిరసన

స్కూల్‌ స్వీపర్ల నిరసన 2
2/2

స్కూల్‌ స్వీపర్ల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement