పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు

Jan 7 2026 7:41 AM | Updated on Jan 7 2026 7:41 AM

పారిశ

పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు

పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు

3 నెలలుగా జీతాలు లేక అవస్థలు

18 నెలల పీఎఫ్‌ బకాయి

రెండు కాంట్రాక్ట్‌ సంస్థల దోబూచులాట

ఏలూరు టౌన్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తోన్న శానిటరీ కార్మికులు ఆకలి కేకలు సర్కారుకు వినిపించడం లేదు. రెండు కాంట్రాక్ట్‌ సంస్థలు ఆర్థిక కారణాలతో కోర్టుల కెక్కి కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకునే కుట్రలు చేయటంపై వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మూడు నెలలుగా జీతాలు లేకపోవటంతో కుటుంబాలు పండుగ పూట పస్తులు ఉండాల్సిన దైన్యస్థితి ఏర్పడిందని కార్మికులు బాధ పడుతున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు తమ ఆరోగ్యాలను సైతం ఫణంగా పెట్టి సేవలందిస్తుంటే.. ప్రభుత్వం తమపై ఏమాత్రం కనకరం చూపటంలేదంటూ మానసిక ఆవేదనకు గురవుతున్నారు. గతంలో పనిచేసిన ఫస్ట్‌ ఆబ్జెక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ, కొత్తగా కాంట్రాక్ట్‌ సంస్థ ఫస్ట్‌ ఆబ్జెక్ట్‌ ఏజెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల యాజమాన్యాల ఆర్థిక లావాదేవీల గొడవల మధ్య శానిటరీ కార్మికులు నలిగిపోతున్నారు.

కార్మికుల వెతలు పట్టవా ?

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తోన్న శానిటరీ కార్మికుల కష్టాలు తీర్చే నాథుడే కానరావటం లేదు. సర్వజన ఆసుపత్రితోపాటు రెండు జిల్లాల్లోని ఏరియా హాస్పిటల్స్‌, జిల్లా హాస్పిటల్స్‌లో సుమారు 368 మంది శానిటరీ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా 3 నెలలుగా జీతాలు లేక జీవనం కష్టంగా మారిందని ఆవేదధన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కాంట్రాక్ట్‌ సంస్థ సుమారుగా రూ.1.32 కోట్ల జీతాల బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెలలో జీతాలు వేస్తారని ఆశించినా ఫలితం లేదంటున్నారు.

రూ.4.68 కోట్ల పీఎఫ్‌ బకాయిలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కలిపి జోన్‌–2 గా పరిగణిస్తారు. ఈ జోన్‌–2 పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో శానిటరీ వర్కర్లకు 18 నెలలుగా పీఎఫ్‌ బకాయిలు ఇవ్వకుండా కాంట్రాక్ట్‌ సంస్థ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో శానిటరీ వర్కర్‌కు నెలకు రూ.2 వేల పీఎఫ్‌గా కటింగ్‌ చేస్తారు. జోన్‌–2 పరిధిలో సుమారుగా 1300 మందికి పైగా శానిటరీ వర్కర్లు పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్‌ సంస్థ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదంటున్నారు. కేవలం జోన్‌–2లో కాంట్రాక్ట్‌ సంస్థ పీఎఫ్‌ బకాయిలు సుమారుగా రూ.4.68 కోట్లు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో జీతాలు, పీఎఫ్‌ బకాయిలు పేరుకుపోయినా అధికారులు అలసత్వం వహిస్తున్నారు.

పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు 1
1/1

పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement