హమాలీ కార్మికులకు ఉపాధి కల్పించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలో పని చేస్తున్న హమాలీ కార్మికులకు ఉపాధి కల్పించాలని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. రైతులు అవసరాల కోసం నిలువచేసే ఎరువులు, పురుగు మందుల గోదాంలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ బుధవారం డీసీఎంఎస్ కార్యాలయం వద్ద ఇఫ్టూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి బద్దా వెంకట్రావు, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాస రావు మాట్లాడుతూ 40 ఏళ్ల నుంచి డీసీఎంఎస్‌లో 21 మంది హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. వారికి ఇప్పటికీ చట్టబద్ధమైన సౌకర్యాలు లేవన్నారు. హమాలీ కార్మికులకు పూర్తి రక్షణ కల్పించవలసిన అధికారులు ఉన్న ఉపాధిని ప్రైవేటు వ్యవస్థకు అప్పచెప్పే ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.


