బరి కోసం చెట్ల నరికివేత
పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహించేందుకు కూటమి నాయకులు భారీ ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే పెనుమంట్ర రజక పేట–జుత్తిగ రోడ్‌లో రైతుకు చెందిన పచ్చిక బీడులో నేలను చదును చేశారు. పంచాయతీరాజ్ రోడ్డును కూడా పార్కింగ్ కోసం లెవల్ చేశారు. బరి ఏర్పాటుకు ఇరువైపులా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పెంచిన చెట్లను సైతం నరికేశారు. ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారుల అండదండలతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీఎం నాయకుడు కేతా గోపాల్ విమర్శించారు.
బరి కోసం చెట్ల నరికివేత


