గ్రామస్థాయి కమిటీలతో పార్టీ బలోపేతం
వేలేరుపాడు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గ్రామస్థాయిలో కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టినట్టు ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర అన్నారు. వేలేరుపాడులో మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన పార్టీ నిర్మాణ సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ , అనుబంధ విభాగాల కమిటీలను నియమించా లని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే దమ్ము చంద్రబాబుకు లేదని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి సూపర్‌సిక్స్‌ను అమలు చేయ డం లేదన్నారు. పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునిల్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనుల వల్లే తాము ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నామని అన్నారు. పోలవరం ఇన్‌చార్జి తెల్లం బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, బూత్ కమిటీ జోన్ ఇన్‌చార్జ్ బీవీఆర్ చౌదరి, నియోజకవర్గ రైతు వి భాగం అధ్యక్షుడు కామినేని వెంకటేశ్వరరావు, జె డ్పీటీసీ గుజ్జా రామలక్ష్మి, ఎంపీపీ వల్లా లక్ష్మీదేవి, గుద్దేటి భాస్కర్, సర్పంచ్‌లు ఉదయ్‌కిరణ్, లక్ష్మ ణ్, వైస్ ఎంపీపీలు కేస గాని వెంకటేశ్వరమ్మ, మే డవరపు నాగశ్రీ, ఎంపీటీసీ కొమ్మరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


