వైఎస్సార్‌సీపీలోకి చేరికలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

Jan 9 2026 7:23 AM | Updated on Jan 9 2026 7:23 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

వైఎస్సార్‌సీపీలోకి చేరికలు టీఆర్‌కు అధిక చార్జీలు సహించం నిర్మాణ విలువల సర్టిఫికెట్లు సమర్పించాలి కోడేరు ర్యాంపులో అనధికారిక బాటలు

కుక్కునూరు: మండలంలోని చిరవెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబా లు వైఎస్సార్‌సీపీలో చేరాయి. కుక్కునూరులో గురువారం జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు (డీఎన్నార్‌) వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వరక రవికుమార్‌, యర్నం ప్రవీణ్‌, సారంగి రాంబాబు, సున్నం సురేష్‌, సున్నం ప్రవీణ్‌, సరి యం శివ తదితరులు ఉన్నారు.

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): వాహనాల తాత్కాలిక నమోదు (టీఆర్‌)కు అధిక చార్జీలు వసూలు చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఉప ర వాణా కమిషనర్‌ కేఎస్‌ఎంవీ కృష్ణారావు హె చ్చరించారు. ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్‌ కార్యాలయంలో గురువారం టీఆర్‌ చార్జీలపై డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాల తాత్కాలిక నమోదు సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన చా ర్జీలను మాత్రమే వినియోగదారుల నుంచి వ సూలు చేయాలని, అదనపు లేదా అనధికార వ సూళ్లకు తావివ్వొద్దన్నారు. అలాగే ప్రతి షోరూమ్‌లో రుసుముల వివరాలు తెలిపేలా బోర్డులు ప్రదర్శించాలన్నారు. ఆర్‌టీఓ (ఇన్‌చార్జి) ఎస్‌ బీ శేఖర్‌, ఎంవీఐలు బి.భీమారావు, జి.ప్రసాదరావు, పి.రమేష్‌బాబు, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఎం.రాము, ఎం.ఆనందకుమార్‌, 18 మంది వాహన డీలర్లు పాల్గొన్నారు.

వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్టు నిమిత్తం కుక్కునూరు, వేలేరుపాడు మండల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో నిర్మాణ (స్ట్రక్చర్‌) విలువలకు సంబంధించి సర్టిఫికెట్లు సమర్పించని వారు ఈనెల 10లోపు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, భూసేకరణ అధికారి, పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు, కుడి ప్రధాన కాలువ, యూనిట్‌–2, ఏలూరు ఎదుట హాజరుకావాలని పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు, ఆర్‌ఎంసీ యూనిట్‌–2 ఇన్‌చార్జి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.ముక్కంటి ప్రకటనలో తెలిపారు. నిర్మాణ విలువలకు భూసేకరణ చేశామని, నష్టపరిహారాన్ని భూ యజమానులకు చెల్లిస్తామన్నారు. అయితే ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వని వారు (ఆధార్‌ కార్డు, ఇంటి పన్ను, బ్యాంక్‌ అకౌంటు మొదటి పేజీ, డెత్‌ సర్టిఫికెట్‌, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, నోటరీ అఫిడవిట్‌, స్ట్రక్చర్‌ ఆధారాలు మొదలైనవి) హాజరుకావాలన్నారు. వేలేరుపాడు మండలంలో 145, కుక్కునూరు మండలంలో 46 మంది మొత్తంగా 191 మంది అవార్డుదారులు వారి వివరాలు సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు.

పెనుగొండ: కోడేరు ఇసుక ర్యాంపులో అనధికారంగా చేస్తున్న బాట పనులు తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు గురువారం ఆచంట తహసీల్దార్‌ సోమేశ్వరరావుకు, ఆచంట పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రాలు ఇచ్చారు. అ నంతరం వారు మాట్లాడుతూ కోడేరు ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలించడానికి ఇప్ప టికీ బాట పనులు చేస్తున్నారని, అయినా అధి కారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్నా రు. అధికార పార్టీ నాయకులకు అండగా అధికారులు ఉంటున్నారని ఆరోపించారు. ఇసుక తరలింపుపై త్వరలో హైకోర్టులో కేసు వేయనున్నామన్నారు. అక్రమంగా ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సీనియర్‌ నా యకులు సుంకర సీతారామ్‌, కోట వెంకటేశ్వరరావు, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు కేతా తాతరావు, టౌన్‌ అధ్యక్షుడు పెచ్చెట్టి సత్యనారాయణ, బీసీ నాయకులు తదితరులు ఉన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి చేరికలు 1
1/1

వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement